మెట్రో ట్రైన్‌ను ఇలా కూడా వాడేస్తారా..? చూస్తే షాక్.

మెట్రో ట్రైన్లు( Metro Trains ) ఇప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి.మెట్రో ప్రయాణం వల్ల ట్రాఫిక్ లో చిక్కుకునే సమస్య ఉండదు.

ట్రాఫిక్ లో గంటల కొద్ది చిక్కుకుని ఇబ్బందులు పడటం, దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యంతో సమస్యలు తెచ్చుకునే బదులు.మెట్రోలో హాయిగా వెళ్లవచ్చని చాలామంది ప్రయాణికులు భావిస్తున్నారు.

రోడ్డుపై చేసే ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.కానీ మెట్రో ప్రయాణాల్లో అలాంటి ప్రమాదం ఉండదు.

భద్రతతో పాటు సౌకర్యవంతంగా ఉండటంతో ఎక్కువమంది మెట్రో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే మెట్రోలలో కొంతమంది మితిమీరి ప్రవర్తిస్తన్నారు.జంటలు మెట్రోలలోనే అందరి ముందు ముద్దులు పెట్టుకోవడం, హాగ్ చేసుకోవడం లాంటి వాటిపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

ఇక కొంతమంది మెట్రోలలో ఇతరులకు అసౌకర్యం కలిగించే ప్రయత్నాలు చేస్తోన్నారు.మెట్రోలలో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేస్తూ ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నారు.ఇలాంటి వారిపై మెట్రో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

కానీ తాజాగా ఒక అమ్మాయి మెట్రో ట్రైన్ లో మేకప్ కిట్ ఓపెన్ చేసి మేకప్( Makeup ) వేసుకుంది.హెయిర్ స్ట్రెయిటెనర్‌తో జుట్టు దువ్వుకుంది.మెట్రో ట్రైన్ లో ఉండే ఛార్జింగ్ పాయింట్ కు హెయిర్ స్ట్రెయిటనర్ ప్లెగ్‌ తో ఛార్జింగ్ పెట్టి మరీ తన జట్టును సెట్ చేసుకుంది.

కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఢిల్లీ మెట్రోలో( Delhi Metro ) ఇది చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ఢిల్లీ మెట్రో చాలా ప్రత్యేకమైనది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.చివరికి మెట్రో కూడా అమ్మాయిలకు ఇలా ఉపయోగపడుతుందంటూ కామెంట్ చేశాడు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు