సైబర్ వలలో చిక్కిన వితంతు మహిళ.. అత్యాశతో రూ.1.50 కోట్ల పెట్టుబడి..!

అత్యాశ మనిషిని ఆలోచించకుండా నట్టేట మునిగిపోయేలా చేస్తుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.ఓ మహిళ కు తన భర్త చనిపోయాక రూ.

1.50 కోట్ల ఇన్సూరెన్స్ వచ్చింది.సైబర్ నెరగాళ్లు ఆ మహిళకు పెట్టుబడి పేరుతో అత్యాశ చూపించి మొత్తం డబ్బు కాజేసిన ఘటన హైదరాబాద్ లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్( Police Commissionerate LB Nagar ) లో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ లో నివసిస్తున్న 48 ఏళ్ల మహిళ యొక్క భర్త కొద్ది రోజుల క్రితం మరణించాడు.

ఆమె భర్తకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కోటిన్నర వచ్చాయి.ఈ విషయం సైబర్ నేరగాళ్లకు( cyber criminals ) ఎలా తెలిసిందో తెలియదు కానీ ఆ సైబర్ నేరగాళ్లు బాధిత మహిళకు ఫోన్ చేసి పెట్టుబడి పెడితే డబుల్ డబ్బులు వస్తాయని నమ్మకపు మాటలు పలికారు.ఆ మహిళ తో పెట్టుబడులు పెట్టించి రూ.5 లక్షల( 5 lakhs ) వరకు చెల్లించారు.దీంతో బాధిత మహిళ సైబర్ నేరగాలను పూర్తిగా నమ్మేసింది.

ఇక మంచి సమయం చూసుకుని సైబర్ నేరగాళ్లు కోటిన్నర పెట్టుబడి పెడితే రూ.మూడు కోట్ల రూపాయలు వస్తాయని అత్యాశ చూపించారు.ఒక్కసారిగా మూడు కోట్లు వస్తాయని అత్యాశకు పోయిన ఆ మహిళ ఈ విషయం గురించి ఎవరితో చర్చించకుండా ఆ సైబర్ నేరస్థుడు ఇచ్చిన ఖాతాకు డబ్బులు అన్ని బదిలీ చేసేసింది.

Advertisement

బ్యాంక్ అధికారులు ఇలా ఒకటేసారి అంత మొత్తం ఒకే ఖాతాకు బదిలీ చేయడం సరి కాదని, ఇలా చేస్తే మోసపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరించిన ఆ మహిళ బ్యాంక్ అధికారుల మాటలను పెడచెవిన పెట్టి కోటిన్నర రూపాయలను బదిలీ చేసింది.

ఆ తరువాత రెండు నెలల పాటు ఆ బాధిత మహిళను సైబర్ నేరగాళ్లు మభ్యపెట్టి అధిక మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ పుట్టించారు.కానీ డబ్బులు ఇవ్వాలని ఆ మహిళ అడగడంతో అవతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వెంటనే బాధిత మహిళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కోటిన్నర మొత్తం ఏకంగా 600 బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లినట్లు తెలిసింది.

ఈ బ్యాంకు ఖాతాలో ఒక బ్యాంకు ఖాతా కోల్ కత్తా కు చెందినదిగా గుర్తించారు.పోలీసులు ఈ ఖాతాలను గుర్తించి వాటిని క్రోడీకరించి సైబర్ నేరగాళ్లను పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు.

మోహన్ బాబు పై పరోక్షంగా కామెంట్స్ చేసిన చిరు.. స్పందించిన మనోజ్?
Advertisement

తాజా వార్తలు