వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది.ఈ మేరకు మెడికో విద్యార్థిని సీనియర్లు విచక్షణారహితంగా కొట్టారని తెలుస్తోంది.

ఘటనపై కేసు నమోదు చేసిన మట్వాడ పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.సుమారు పది మంది విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

A Raging Commotion At Warangal Kakatiya Medical College-వరంగల్ క�

కేఎంసీ ఆవరణలో ఈనెల 14న పుట్టినరోజు వేడుకల సందర్భంగా ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుందని సమాచారం.కాగా పది మంది సీనియర్ మెడికోలపై ఏడాది పాటు వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు