వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు( Minister Dharmana Prasada Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు.
నాయకుడు( Leader ) తప్పు చేయకూడదన్న ఆయన ఎవరినీ చేయనివ్వకూడదని పేర్కొన్నారు.శ్రీకాకుళానికి( Srikakulam ) తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని తెలిపారు.
శ్రీకాకుళంలో వనరులు ఉన్నాయనే పక్క జిల్లాల నుంచి వచ్చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలా వదిలేస్తే రౌడీలమయం అయిపోతుందని వెల్లడించారు.మిగతా ప్రాంతాలు ఇలానే పాడై పోతున్నాయని తెలిపారు.దశాబ్దాలుగా శ్రీకాకుళం ప్రశాంతంగా ఉండాలనే చూస్తున్నానని పేర్కొన్నారు.
జిల్లాలో ఎక్కడైనా గెలుస్తానన్న ఆయన శ్రీకాకుళంలో వేరే వారు గెలవరన్నారు.మిగతా వారు కనీసం అభివృద్ధి కూడా చేయలేరని తెలిపారు.