Poha : బ్రేక్ ఫాస్ట్ లో అటుకులు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసా?

అటుకులు( Poha )వీటి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.వరి ధాన్యం నుంచి అటుకుల‌ను త‌యారు చేస్తారు.

 Amazing Health Benefits Of Eating Flattened Rice For Breakfast-TeluguStop.com

ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల ప్ర‌జ‌లు వీటిని ఆహారంగా తీసుకుంటారు.అటుకులను చాలా మంది పోహా అని పిలుస్తుంటారు.

అలాగే అటుకులతో రకరకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తుంటారు.అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అటుకులు తినడం ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

అల్పాహారంగా అటుకులు తినడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

Telugu Breakfast, Benefits, Tips, Latest, Poha, Poha Dosa, Poha Benefits-Telugu

అటుకుల్లో కేలరీలు చాలా మితంగా ఉంటాయి.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి అటుకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అటుకులు తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

అలాగే అటుకులు గ్లూటెన్ రహితంగా ఉంటాయి.ఫైబర్ ను పుష్కలంగా కలిగి ఉంటాయి.

అందువల్ల మ‌ధుమేహం ఉన్న వారు అటుకులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో అటుకులు కూడా ఒకటి.

రక్తహీనత( Anemia )తో బాధపడే వారికి అటుకులు ఉత్తమమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.ముఖ్యంగా అటుకులు బెల్లం కలిపి తీసుకుంటే ఎలాంటి రక్తహీనత అయిన పరార్ అవుతుంది.

అలాగే అటుకుల్లో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియ( Digestion )ను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

Telugu Breakfast, Benefits, Tips, Latest, Poha, Poha Dosa, Poha Benefits-Telugu

అటుకుల ద్వారా మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు పొందవచ్చు.బ్రేక్ ఫాస్ట్ లో అటుకుల‌ను తీసుకోవడం వల్ల పొట్ట ఎంతో తేలిగ్గా ఉంటుంది.బ‌ద్ధ‌కం ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటుంది.ఇక అటుకులతో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు.అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా, అటుకుల దోశ ( Poha Dosa )ఇలా అనేక వంటలు చేసుకుని తిన‌వ‌చ్చు.పైగా అటుకులతో చేసే వంటలు చాలా ఈజీగా అయిపోతాయి.

రుచికరంగా ఉంటాయి ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube