కరోనా కష్టకాలం తరువాత పరిస్థితులు చాలా మారిపోయాయి.నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి.లీటర్ పెట్రోల్, డీసెల్ కొనాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయి.
ఈ క్రమంలో జనాలలో ప్రత్యామ్నాయ ఆలోచనలు వచ్చాయి.చాలావరకు ఇపుడు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు.
వీరిని దృష్టిలో ఉంచుకొని చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.అనేకమంది ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లు, సైకిల్స్ పైన మోజు చూపుతున్నారు.
అలాగే తాజాగా రైతులు కూడా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ విషయంలో ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఆ కారణం చేత హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ Celestial e-mobility దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు తయారు చేయడానికి కంకణం కట్టుకుంది.
అయితే ఈ ట్రాక్టర్స్ ను ఇతర వాణిజ్య అవసరాలకు కాకుండా వ్యవసాయ అవసరాలకు మాత్రమే తయారు చేయడం హర్శించదగ్గ విషయం.హైదరాబాద్ కు చెందిన సిద్ధార్థ్ దురైరాజన్ అండ్ సయ్యద్ ముబాషీర్ ఈ వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు.
స్టార్టప్ ప్రారంభించి అతి కొద్ది రోజుల్లోనే ఈ స్టార్టప్ సెలెస్టియల్ ఇ-మొబిలిటీ, ప్రీ-సిరీస్ A ఫండింగ్ రౌండ్‌లో $35 మిలియన్ల విలువతో 500,000 ఫండ్ ను సేకరించింది.
ప్రస్తుతం వీరు రూపొందించిన ఈ ట్రాక్టర్ల అగ్రి, ఎయిర్‌పోర్ట్ గూడ్స్ క్యారియర్ రంగాల అవసరాలను తీర్చడానికి అనువుగా ఉంటుంది అంటున్నారు సంస్థ ప్రతినిధులు.ఇప్పటికే వీళ్ల ఐడియా నచ్చి మెక్సికన్ కంపెనీ Grupo Marvelsa ఇందులో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది.30 ఏళ్ల అనుభవం ఉన్న మెక్సికన్ కంపెనీ గ్రూపో మార్వెల్సా భాగస్వామ్యంతో 2,500 డీలర్‌షిప్ నెట్‌వర్క్, 800 సర్వీస్ సెంటర్లు అండ్ 35 వెహికల్ యూనిట్ల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.