వృద్ధ అభిమాని ఆశీర్వాదం తీసుకున్న నీరజ్ చోప్రా.. నెటిజన్ల ప్రశంసలు

ఎవరికైనా కొంచెం పేరు, డబ్బు వస్తే భూమి మీద వారి కాళ్లు నిలవవు.తమ ముందు ఎవరైనా బలాదూర్ అన్నట్లు వ్యవహరిస్తారు.

 Neeraj Chopra Who Took The Blessings Of An Old Fan Netizens Praise , Niraj Chopr-TeluguStop.com

వారికి కళ్లు నెత్తికెక్కాయని పలువురు తిట్టుకుంటుంటారు.అయితే ఇది అందరి విషయంలోనూ అలాగే జరగదు.

కొందరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో ఎంతో ఆకట్టుకుంటారు.తమ ప్రవర్తనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటారు.

తాజాగా ఒలింపిక్ మెడల్ సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధ అభిమాని కాళ్లకు నమస్కరించడం పలువురిని ఆకట్టుకుంటోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రతిష్టాత్మక స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా పాల్గొంటున్నాడు.

కేవలం అతి తక్కువ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు.అయితే తన మంచి మనస్తత్వంతో ఎంతో మంది అభినందనలను పొందాడు.

గేమ్‌లో పాల్గొన్న తర్వాత స్టేడియం వెలుపల ఆయనను పలకరించేందుకు అభిమానులు వచ్చారు.వారితో ఫొటోలు దిగి అందరినీ ఉత్సాహపరిచాడు.

అందరినీ మర్యాదపూర్వకంగా పలకరించాడు.చివరలో అతను బయలుదేరే ముందు చాలా మందికి కరచాలనం చేశాడు.

చివరికి ఓ వృద్ధ అభిమానిని గుర్తించి, అతని అతని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. తర్వాత తను వేగంగా వెళ్లిపోయాడు.

ఆయన అభిమాని ఒకరు దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో నీరజ్ చోప్రాపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

పెద్దలను గౌరవించడం, వారి పాదాలకు నమస్కరించడం భారతీయ సంస్కృతిలో భాగమని, ఎంత పేరు సంపాదించినా తన మూలాలను నీరజ్ మరవలేదని పలువురు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube