భార్యకు ప్రత్యక్ష దైవమై సేవలు చేస్తున్న భర్త...!

యాదాద్రి భువనగిరి జిల్లా: వివాహ సమయంలో అగ్నిసాక్షిగా కొత్త దంపతులచే జీవితాంతం ఒకరికి ఒకరు తోడునీడగా,కష్టసుఖాలను సమానంగా కలిసి పాలుపంచుకోవాలని ప్రమాణం చేయించి,సతికి పతే ప్రత్యక్ష దైవమని చెబుతారు.

ఆనాటి ప్రమాణాలను బుట్ట దాఖలు చేసి,భార్యలను చెర బట్టిన భర్తలు, భర్తలను బాధ పెట్టిన భార్యలు ఎందరో ఉన్నారు.

కానీ,ఆ మాటలకు కట్టుబడి పక్ష వాతంతో మంచానపడ్డ భార్యకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుతున్న ఓ భర్త కథ యాదాద్రి భువనగిరి జిల్లాలో అందరినీ ఆలోచింప చేస్తుంది.వివరాల్లోకి వెళితే.

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన రాసమల్ల ఎల్లయ్య, శంకరమ్మ వృద్ద దంపతులు.శంకరమ్మ నాలుగేళ్ల క్రితం పక్షవాతానికి గురైంది.

అప్పటి నుండి భర్త ఎల్లయ్య ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ ఎన్నో అవస్థలు పడుతన్నాడు.భార్య స్వతహాగా అన్నం తినలేదు,వాష్ రూమ్ పోలేదు,మంచినీళ్ళు కూడా తాగలేని దుస్థితి.

Advertisement

నాలుగేళ్లుగా వృద్దాప్యంలో కూడా ఎల్లయ్య చేస్తున్న సతి సేవ అందరినీ ఆలోచింపజేస్తుంది.కానీ,వారికి వెన్నుతట్టి ధైర్యాన్ని ఇచ్చేవారే కనిపించడం లేదు.

ఇదే విషయమై బాధిత వృద్ద దంపతులను పలకరించగా కష్టాలు, కన్నీళ్ళతో ఆకలి దప్పికలు తీర్చుకుంటున్నామని,అయ్యో పాపం అనే వారే కానీ,ఆదుకునే వారు ఎవరూ లేరని కన్నీటి పర్యంతమయ్యారు.ఎలక్షన్ సీజన్లో రాజకీయ నాయకులు వస్తారు, చూస్తారు,తప్పకుండా సాయం అందిస్తామని హామీ ఇస్తారు, అంతులేకుండా పోతారని వాపోయారు.

గతంలో ఎన్నికలకు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చి పోయారు కానీ, మాకు ఎలాంటి న్యాయం చేయలేదని,ఇప్పుడున్న రాజకీయ నాయకులను కూడా పలుమార్లు కలిసినా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు.మాకు వచ్చిన రోగం కంటే ఎవరూ పట్టించుకోవడం లేదనే మానసిక వేదన మరింత కృంగదీస్తుందని, మా దయనీయ పరిస్థితిని చూసి మనసున్న మారాజులు దయచేసి మాకు ఎంతో కొంత సహాయ,సహకారాలు అందించాలని వృద్ద దంపతులు వేడుకుంటున్నారు.

అపన్న హస్తం అందించిన ఆది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు 6లక్షల
Advertisement

Latest Video Uploads News