వీధి లైట్ల వెలుగులో చదువుకుంటున్న బాలిక... ఫిదా అవుతున్న నెటిజన్లు!

మారుతున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా దేశం ఎంత అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నప్పటికీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా హృదయవిదారకంగా అనిపిస్తాయి.

అవును, నేటికీ భావి భారత పౌరులు ఇంకా దుర్భర జీవనంలోనే గడుపుతున్న సంఘటనలు కళ్ళకి కనబడుతున్నపుడు కళ్ళు చెమర్చకమానవు.

ఈదేశంలో ఇంకా వీధి దీపాల కిందే చదువుకుంటున్నవారు వున్నారంటే మీరు నమ్ముతారా? దేశం అభివృద్ధి చెందుతున్నా పేదల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.వారికీ కనీస మౌలిక సదుపాయాలు కూడా అందటంలేదనేది నగ్నసత్యం.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే దానికి ఓ మంచి ఉదాహరణ.ఓ బాలిక స్కూలు అయిపోయిన తర్వాత ఓ వీధి లైటు కింద కూర్చుని హోం వర్క్‌ చేసుకుంటున్న వీడియోని ఇక్కడ మీరు చూడవచ్చు.

ప్రస్తుతం సదరు వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు బాలిక అంకిత భావానికి ఫిదా అవుతున్నారు.

Advertisement

కొంతమంది ఆమె శ్రద్ధకి ప్రశంసలు కురిపిస్తున్నారు.రోడ్డుపై వెళ్లే వాహనాల రణగొణ ధ్వనులు సైతం ఆ బాలిక ఏకాగ్రతను భగ్నం చేయలేక పోయాయి.

స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్న ఆ బాలిక ఫుట్‌పాత్‌పై కూర్చొని చాలా సీరియస్‌గా చదువుకోవడం వీడియోలో మీరు చూడవచ్చు.తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించినా కొందరు విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తారు.ఇలా అలాంటి వారికి ఈ బాలిక ఎంతో స్ఫూర్తిదాయకం.

కనీస సౌకర్యాలు కూడా లేని పేద పిల్లలు తమ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వాలు తోడ్పడాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అటుగా వాహనంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి తన మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌ అయ్యింది.

వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు