నీటిలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న కుక్క.. వీడియో వైరల్

సోషల్ మీడియాలోని వెరైటీ కంటెంట్ చూస్తే ఒక్కోసారి మన ముఖంపై చిరునవ్వు వస్తుంది.

అయితే తాజాగా అలాంటి చిరు నవ్వు తెప్పించే ఒక వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో లో ఒక క్యూట్ డాగ్ నీటిలో ఎంజాయ్ చేస్తూ అందరినీ ఫిదా చేసింది.ఈ అందమైన లాబ్రడార్ జాతి కుక్క నీటితో నిండిన కొన్ని బకెట్ల క్రింద దూకడం, సరదాగా ఆడుకోవడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు.

వైరల్ అవుతున్న వీడియోను బ్యూటెంగేబిడెన్ పేజీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.ఈ వీడియోలో, బకెట్లు ఒక్కొక్కటిగా నీటిని పోస్తుండగా.

వాటి కింద కుక్క నీటిలో తడుస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎంజాయ్ చేయడం గమనించవచ్చు.అయితే సాధారణంగా కుక్కలు నీటిలో తడిచేందుకు అంతగా ఇష్టపడవు.

Advertisement

వేసవి తాపం నుంచి బయటపడేందుకు నీటిలో మునుగుతాయేమో కానీ మామూలు సమయాల్లో ఇవి నీటికి ఆమడదూరం ఉంటాయి.కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కుక్క మాత్రం చల్లటి వాతావరణంలోనే నీటిలో నడుస్తూ ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించింది.

సినిమాల్లో హీరోయిన్ వర్షంలో తడిసినట్లుగా ఇది బకెట్లతో కుమ్మరించిన వర్షంలో తడుస్తూ తన కంటే ఎవరూ సంతోషంగా ఉండలేరు అని చెప్పకనే చెప్పింది.

అయితే ఇది ఇలా చేస్తున్నప్పుడు యజమాని తన కెమెరాలో రికార్డ్ చేశారు.ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ వీడియోకి దాదాపు కోటి వ్యూస్ వచ్చాయి.

"ఇది చూస్తుంటేనే సంతోషం కలుగుతుంది.ఈ కుక్కతో జాయిన్ కావాలని నాకూ ఉంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

కుక్క లాగా నేను కూడా జీవితాన్ని ఎప్పుడు సంతోషంగా గడపగలుగుతానో" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ క్యూట్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు