శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగుబంట్ల కలకలం

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో ఎలుగుబంట్ల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.కొండలు, గుట్టల నుంచి భల్లూకాలు గ్రామాల వైపు వస్తున్నాయి.

గ్రామ శివారు ప్రాంతాల్లోని కొబ్బరి, జీడి తోటల్లో సంచరిస్తున్న ఎలుగుబంట్లు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.అంతేకాకుండా పొలాలకు వెళ్తున్న ప్రజలపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈక్రమంలోనే భల్లూకాలు చేసిన దాడిలో ఇప్పటివరకు నలుగురు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.

అధికారులు స్పందించి ఎలుగుబంట్ల దాడి నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు