సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల్లో చాలా వరకు అందరూ మంచి సినిమాలు చేస్తూ మంచి పొజిషన్ లోనే ఉన్నారు కానీ కొంత మంది మాత్రం చాలా సూపర్ గా వాళ్ల లైఫ్ ని వాళ్లే డిజైన్ చేసుకుంటూ ఉంటారు.అలాంటి వాళ్లలో మన తెలుగు హీరోలు( Telugu Heros ) ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే మన వాళ్ళు సినిమాలు అని మాత్రమే కాకుండా మాల్స్, పబ్స్ లాంటి వాటిని క్రియేట్ చేసి వాటి ద్వారా లాభాలను గడిస్తు ఉంటారు…ఇక సినిమాల్లో సంపాదించిందంతా బిజినెస్ ల్లో పెట్టుబడి గా పెట్టిఎక్కువ లాభాలను ఆర్జించడానికి చూస్తూ ఉంటారు…
అయితే ఇండస్ట్రీ అనేది పక్క బిజినెస్ కి( Business ) సంబంధించిందే కాబట్టి ఇక్కడ ప్రతి హీరో గానీ, ప్రొడ్యూసర్ గానీ వాళ్ల కి సినిమా వల్ల ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి అనే విషయం ఒకటే చూస్తారు తప్ప మిగితా విషయాలతో వాళ్ల కి సంబందం ఉండదు…అయితే హీరో లు ప్రస్తుతం రెమ్యునరేషన్( Remuneration ) కాకుండా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో తను చేసే ప్రతి సినిమాకి రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటూ ఉంటాడు.అందుకే ఆయన సినిమా సక్సెస్ తర్వాత మాత్రమే షేర్ ఎంత వస్తుందా అని చూస్తాడు…
ఇక ప్రొడ్యూసర్లు కూడా దానికి సిద్ధమై ఆయన చెప్పినట్టు గా లాభాల్లో పర్సంటేజ్ ఇస్తున్నారు ఇలా ఇవ్వడం వల్ల ఎవరికి లాభం అంటే మహేష్ బాబు సినిమాకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఆయన సినిమా అవరెజ్ గా ఆడిన కూడా 100 కోట్ల పైన కలెక్షన్స్ వస్తాయి.అదే హిట్ అయితే 300 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే అంత కలక్షన్స్ వస్తాయి.అలా వచ్చిన దాంట్లో షేర్ తీసుకోవడం వల్ల హీరో కి ప్లస్ అవుతుంది కానీ కొన్ని సార్లు ఇది మైనస్ కూడా అవ్వచ్చు
ఎలా అంటే సినిమా డిజాస్టర్ అయిందనుకో ప్రొడ్యూసర్లకి లాస్ వచ్చిందంటే ఇక హీరో కూడా షేర్ రూపం లో తనకి వచ్చే డబ్బులను నష్టపోవాల్సి ఉంటుంది… అందుకే చాలా మంది హీరో లు ఇలా రిస్క్ ఎందుకు అని సినిమా మొదట్లోనే రెమ్యూనరేషన్ ఎంతనో చెప్పి అంత అమౌంట్ తీసుకొని సినిమా చేస్తారు ఇలా అయితే సినిమా తో ఏ భాద ఉండదు అది ఆడిన పోయిన వీళ్ళ మని వీళ్ళకి వస్తుంది…
.