50 ఏళ్ల క్రితం రోలెక్స్ వాచ్‌ని మింగేసిన ఆవు.. ఇంగ్లాండ్ రైతుకు చివరికి షాక్..?

సాధారణంగా మనం ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకుంటే మళ్లీ అది దొరకదు.

మనలో కొంతమందికే అదృష్టం ఉంటే మాత్రం అది ఎన్నేళ్లయినా మళ్లీ మన వద్దకే తిరిగి వస్తుంది.

అలాంటి ఒక సంఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే, 1970ల ప్రారంభంలో, బ్రిటిష్ రైతు జేమ్స్ స్టీల్ ( British farmer James Steele )తన ఖరీదైన రోలెక్స్ గడియారాన్ని కోల్పోయాడు.

అనుకోకుండా దాని బెల్ట్ తెగడంతో గడియారం నేలపై పడిపోయింది.స్టీల్ ఒక ఆవు దానిని మింగి ఉండవచ్చని భావించాడు, ఎందుకంటే ఆ సమయంలో ఆవు అతని పొలంలో గడ్డిమేస్తుంది.

గడియారం తిరిగి దొరకదని అతను ఆశను వదులుకున్నాడు.

Advertisement

50 ఏళ్ల తరువాత 2024లో 95 ఏళ్ల జేమ్స్( James ) మళ్లీ తన గడియారాన్ని కనిపెట్టగలిగాడు.వేరే వ్యక్తి ద్వారా అది మళ్లీ తన చెంతకే చేరింది.దాంతో ఆశ్చర్య పోవడం అతని వంతయింది.

ఇటీవల ఒక మెటల్ డిటెక్టింగ్ ఎక్స్‌పర్ట్ జేమ్స్ కు సంబంధించిన భూమిని లోతుగా తవ్వేటప్పుడు, జేమ్స్ కోల్పోయిన రోలెక్స్ గడియారం( Rolex watch ) దొరికింది.అయితే, గడియారం బాగా దెబ్బతింది, డయల్ మాత్రమే మిగిలి ఉంది.

అయినా జేమ్స్ చాలా సంతోషించాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత తన గడియారం తిరిగి దొరికిందని నమ్మలేకపోయాడు.

వాచ్ ఒరిజినల్ బెల్ట్ ( Watch original belt )సగం మాత్రమే మిగిలి ఉంది, మిగతా సగం కాలక్రమేణా భూమిలో కలిసి ఉండొచ్చు.గడియారం ముఖం ఆకుపచ్చ రంగులోకి మారింది, కానీ తుప్పు పట్టలేదు.అధిక మరమ్మతు ఖర్చుల కారణంగా, జేమ్స్ గడియారాన్ని జ్ఞాపకచిహ్నంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈటెల ఆ పదవి కన్నేశారా ? అసంతృప్తితో రగిలిపోతున్నారా ?
పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఫోకస్ చేసిన అకీరా... ఆత్రుతగా ఉందంటూ?

మోడర్న్ రోలెక్స్ వాచ్‌లతో పోలిస్తే, అతని వాచ్‌లో డయల్ చాలా సింపుల్ గా ఉంది.ఇంగ్లాండ్ గ్రామీణ ప్రాంతంలో మెటల్ డిటెక్టర్లు ఇటీవల కనుగొన్నది ఈ వాచ్ ఒక్కటే కాదు.

Advertisement

అదే నెల ప్రారంభంలో మరొక మెటల్ డిటెక్టరిస్ట్ UK మాజీ ప్రధాన మంత్రి జార్జ్ గ్రెన్‌విల్లే (1763-1765 వరకు పనిచేసారు)కు చెందిన ఒక బంగారు ఉంగరాన్ని కనుగొన్నారు.విలువైన ఉంగరం బకింగ్‌హామ్‌షైర్‌లోని ఐల్స్‌బరీ సమీపంలోని పచ్చిక బయళ్లలో 85 ఏళ్ల నాటికి కనుగొనబడింది.ఉంగరం నూనన్స్ మేఫెయిర్‌లో £9,500 (సుమారు రూ.10 లక్షలు)కు వేలం వేశారు.

తాజా వార్తలు