బయోపిక్‌ల పరువు తీస్తున్నారుగా..!

బాలీవుడ్‌లో గత కొంత కాలంగా వరుసగా బయోపిక్‌లు వస్తున్నాయి.ఇప్పటి వరకు హిందీలో వచ్చిన బయోపిక్‌లలో ఎక్కువగా విజయాన్ని సొంతం చేసుకున్నవే ఉన్నాయి.

అందుకే బయోపిక్‌పై తెలుగు సినిమా పరిశ్రమ కూడా దృష్టి పెట్టింది.బాలీవుడ్‌ తర్వాత ఎక్కువగా బయోపిక్‌లు తెరకెక్కుతున్న ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా పరిశ్రమ అని చెప్పుకోవచ్చు.

ఇటీవలే సావిత్రి జీవిత చరిత్ర ‘మహానటి’ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎన్టీఆర్‌, రాజశేఖర్‌ రెడ్డి, కత్తి కాంతారావుల జీవిత చరిత్రలను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇలా ప్రముఖుల జీవిత చరిత్రలు, గొప్ప పనులు చేసి చనిపోయిన వారి జీవిత చరిత్రలు తీస్తే పర్వాలేదు.కాని దిక్కుమాలిన జీవిత చరిత్రలు అన్ని కూడా తీస్తూ బయోపిక్‌ అంటూ పరువు తీస్తున్నారు.అనీల్‌ సుంకర ప్రస్తుతం నాని హీరోగా ఒక దొంగ బయోపిక్‌ను తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.90 లలో తెలుగు రాష్ట్రం పోలీసులకు నిద్రలేకుండా చేసిన దొంగ జీవిత చరిత్రకు రంగం సిద్దం అవుతుంది.ఆ దొంగ పాత్రలో నటించేందుకు నాని కూడా సై అన్నాడు.త్వరలోనే ఆ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.2019 చివర్లో లేదా 2020లో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.దొంగలు, మావోయిస్టులు ఇలా అందరివి కూడా బయోపిక్‌లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ప్రజల్లో గుర్తింపు లేని వారివి, స్థానికంగా మాత్రమే గుర్తింపు ఉండి, అందరికి తెలియని వ్యక్తుల గురించి కూడా బయోపిక్‌లు వస్తున్నాయి.వరంగల్‌ జిల్లాకు చెందిన కొండ మురళి బయోపిక్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది, రౌడీ షీటర్‌గా పేరు పడ్డ మురళి, గత కొంత కాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు.రాజశేఖర్‌ రెడ్డి ఆశిస్సులతో కొండ మురళి భార్య సురేఖ ఎమ్మెల్యే అయ్యి, మంత్రి కూడా అయ్యారు.ఇలా తెలుగు రాష్ట్రాల్లో కొండ ఫ్యామిలీకి మంచి గుర్తింపు దక్కింది.

అయితే గత కొంత కాలంగా వరంగల్‌లో మినహా వారి గురించి ఎక్కడ కూడా కనిపించడం లేదు, వినిపించడం లేదు.దాంతో అంతా వారి గురించి మర్చి పోతున్నారు.

ఇలాంటి సమయంలో కొండ మురళి జీవిత చరిత్ర మూవీకి రంగం సిద్దం అవుతుంది.ఆ సినిమాకు కన్నడ దర్శకురాలు దర్శకత్వం వహించబోతుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?

ఈ చిత్రాన్ని నిర్మించేది ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.కన్నడ దర్శకురాలు ఎందుకు మురళి బయోపిక్‌ను నెత్తికి ఎత్తుకుంది, అసలు ఆయన బయోపిక్‌ ఎందుకు అంటూ సినీ వర్గాల్లో కొందరు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు