ఏపీలో విపక్ష టీడీపీకి వరుస షాకుల పరంపరలో మరో షాక్ తగిలింది.ఆ పార్టీ నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోగా తాజాగా మరో సీనియర్ నేత సైతం పార్టీని వీడారు.విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు.టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పడాల అరుణ పార్టీకి రాజీనామా చేశారు.త్వరలోనే ఆమె బీజేపీలో చేరనున్నా రు.పడాల అరుణ టీడీపీలో సీనియర్ నాయకురాలు.ఆమె గజపతినగరం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.2009 ఎన్నికల నుంచి ఆమెకు పార్టీలో ప్రాధాన్యం లేదు.చివరకు 2014 ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు తనను గుర్తిస్తారని ఆమె అనుకున్నా పట్టించుకోలేదు.
తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమెకు స్థానికంగా కాస్త పట్టు ఉంది.
ప్రస్తుత వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆమెకు బంధుత్వాలు కూడా ఉన్నాయి.ఇక ఉత్తరాంధ్రలో తూర్పు కాపులపై బీజేపీ బాగా కాన్‌సంట్రేషన్ చేస్తోన్న నేపథ్యంలోనే బీజేపీ ఆమెపై దృష్టి పెట్టి చర్చలు జరిపి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
అదే సమయంలో ఇటు టీడీపీలో పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో పాటు పార్టీకి భవిష్యత్ లేదన్న నిర్ణయానికి వచ్చిన ఆమె పార్టీని వీడారు.

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వల్లే తాను టీడీపీలో ఎదగలేకపోయానని అరుణ అప్పుడప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేసేవారు.గజపతినగరంలో అరుణను కాదని.మాజీ ఎమ్మెల్యే కేఏ.
నాయుడును చంద్రబాబు ప్రోత్సహించారు.గజపతినగరం రాజకీయాల్లోకి కేఏ.నాయుడు ఎంట్రీ ఇచ్చాక అసలు అరుణ పేరు వినిపించడమే మానేసింది.ఇక ఇప్పుడు ఆమె దారి ఆమె చూసుకుంటున్నారు.
ఇక ఇప్పటికే విజయనగరం జిల్లాలో గతంలో టీడీపీలో ఉన్న మాజీ జడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు.ఇదే లిస్టులో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ కూడా ఉన్నారని టాక్ ? ఏదేమైనా అసలే అంతంత మాత్రంగా ఉన్న విజయనగరం టీడీపీ ఈ షాకులతో మరింత విలవిల్లాడుతోంది.