విదేశాలలో వీటిపైన బ్యాన్ విధించారు.. కానీ మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్నాం!

మనం ఎంత అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో జీవిస్తున్నా ఇప్పటికీ కొన్ని విషయాలలో వెనకబడే వున్నాం.అందులో ప్రధమంగా వీటిని చెప్పుకోవచ్చు.

ప్రపంచంలోని ఇతర దేశాలలో నిషేధించబడిన అనేక ఉత్పత్తులను మన భారతదేశంలో అమ్ముతున్నారు.మనం ఇష్టంగా కొనుక్కుంటుంటున్నాం.

ఇందులో సబ్బు నుంచి కార్ల వరకు అన్నీ ఉన్నాయి.అవేమిటో ఇప్పుడు చూద్దాం.అలాగే ఆయా వస్తువులపై నిషేధం ఎందుకు విధించారో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం.1.అందులో మొదటిటి చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే "కిండర్ జాయ్ చాక్లెట్‌".

దీనిని USలో నిషేధించారు.చాక్లెట్ గొంతులో అంటుకుంటుంది కాబట్టి అక్కడ ఈ చాక్లెట్ ఎగ్ ను నిషేధించారు.కానీ, మన దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే చాక్లెట్ లో ఈ కిండర్ జాయ్ ఒకటి కావడం బాధాకరం.2.అలాగే రెండవది భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన "Lifebuoy" సబ్బు.

Advertisement

దీనిని అనేక యూరోపియన్ దేశాలలో నిషేదించారు.ఈ సబ్బు ప్రమాణం కంటే గట్టిగా ఉన్నందున అక్కడ నిషేధించబడింది.

ఇంతటి గరకుతనం ఉన్న సబ్బును మనం మాత్రం చాలా ఇష్టంగా ఒంటికి పూసుకుంటున్నాం.

3.ఇక మూడవది భారతీయ యువత ఎంతగానో ఇష్టపడి తాగుతున్న "రెడ్ బుల్" డ్రింక్. దీనిని ఫ్రాన్స్ మరియు డెన్మార్క్‌లలో నిశేషించారు.

ఈ డ్రింక్ తాగే వ్యక్తులు ఒత్తిడి, టెన్షన్ మరియు డిప్రెషన్‌కు గురవుతారని ఆ దేశాలు బ్యాన్ చేయడం జరిగింది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ ను వాడితే ఊడిన జుట్టు కూడా మళ్లీ వస్తుంది!

4.ఈ లిస్టులో నాలుగవది లైట్ బల్బులు. ఐరోపా దేశాలలో ఈ ఎరుపు రంగు కాంతిని ఇచ్చే లైట్ బల్బులు నిషేధించబడ్డాయి.

Advertisement

విద్యుత్తు ఎక్కువగా వినియోగిస్తున్నందున ఈ రకమైన బల్బులను అక్కడ నిషేధించారు.కానీ.

మన దేశంలో ఇప్పటికీ వీటి వినియోగం ఎక్కువ స్థాయిలో ఉండటం విచారకరం.

5.ఇక ఐదవది మన ఇండియాలో సూపర్ హిట్ అయిన "మారుతీ ఆల్టో" కారు.అయితే ఇది సురక్షితం కాదనే కారణంతో యూరోపియన్ దేశాలు నిషేధించాయి.కానీ.

ఇక్కడ మధ్యతరగతి ప్రజలకు ఈ ఆల్టో కార్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు