రామసేతుని పోలిన వంతెన-ఆసక్తికరమైన విషయాలు

మీరిప్పటివరకు ఎన్నో రకాల వంతెనలను చూసుంటారు.ఒక్కో వంతెనకి ఒక్కో విశేషం ఉండొచ్చు కాని.

ఇప్పుడు మీరు చదవబోయే వంతెన చాలా ప్రత్యేకమైనది.రామాయణంలో రాముడు లంకలో ఉన్న సీతను తీసువచ్చేందుకు సముద్రంపై ‘రామసేతు’ నిర్మించాడని చెబుతుంటారు.

వీటి ఆనవాళ్లు కనిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి.ఇప్పుడు రామసేతుని పోలిన వంతెన ఒకటుంది.

దానికి సంభందించిన ఆసక్తికరమైన విషేషాలు.రామసేతుని తలపించే వంతెన ఉన్నది ఎక్కడంటే కంబోడియాలో.

Advertisement

దీనిని కలపతో నిర్మిస్తారు.నిర్మిస్తారు ఏంటి.

నిర్మించారు అని కదా అని అనాలి అంటారా.ఈ వంతెనను ప్రతి ఏటా నిర్మిస్తారు.

వర్షాకాలానికి ముందు స్థానికులు ఈ వంతెనను ద్వంసం చేస్తూ ఉంటారు.ఈ సమయంలో నదికి వరదలు వస్తే ఆటకం కలుగుతుందని ఇలా చేస్తుంటారు.ఈ వంతెన నిర్మాణం కోసం ఇక్కడి వారంతా కలపను భద్రపరుస్తుంటారు.వాతావరణ పరిస్థితులు అనుకూలం కాగానే వంతెనను పునర్నిర్మిస్తారు.ప్రతీ యేటా ఈ తంతు జరుగుతూనే ఉంటుంది.3,300 అడుగుల పొడవున్న దీనిని 50 వేల వెదురు బొంగులతో నదిపైన నిర్మిస్తారు.ఇది అద్భుతమైన నిర్మాణాన్ని తలపిస్తుంది.

కలపతో నిర్మిస్తారంటే కేవలం ఆకర్షణ కోసమే అనుకుంటే పొరపాటు.దీనినిచాలా దృడంగా నిర్మిస్తారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఎంత ధృడంగా నిర్మిస్తారంటే దీనిపై ట్రక్కులు సైతం సులభంగా ప్రయాణించగలుగుతాయి.ఈ వంతెనను మెకాంగ్ నదిని దాటేందుకు నిర్మిస్తుంటారు.

Advertisement

ఈ వంతెనపై వెళ్లాలంటే డబ్బు చెల్లించాలి.ఎంత అనుకుంటున్నారు కేవలం రెండు రూపాయలు మాత్రమే.

అదే విదేశీ పర్యాటకులైతే ఇంకా అధిక మొత్తంలో చెల్లించాల్సివుంటుంది.

తాజా వార్తలు