సమాజంలో రోజురోజుకీ మానవత్వం కనుమరుగైపోతుంది.భార్యాభర్తల మధ్య విభేదాలు మరోపక్క అక్రమ సంబంధాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.ఈ క్రమంలో సొంత భార్య.భర్త ని కన్పించడంలేదా మరోపక్క రివర్స్ గా భర్త భార్యని చంపటం ఇటువంటి ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితి లో సమాజం ఉంది.
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉన్న కొద్ది తగ్గిపోతుంది.సరిగా ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.
ఒక వ్యక్తి సొంత భార్య ని అదే రీతిలో రెండు సంవత్సరాలు కలిగిన కన్న కొడుకుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.రెండు సంవత్సరాలు కలిగిన కొడుకు ని గొంతు కోసి హత్య చేసిన తండ్రి.
భార్యపై హత్యాయత్నానికి పాల్పడటంతో.కొడుకు స్పాట్లో చచ్చిపోయాడు.
ఈ క్రమంలో గాయపడిన భార్య ని.స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.అయితే ప్రస్తుతం భార్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం.వాస్తవానికి ఈ ఇద్దరు భార్యాభర్తలకి ఇది రెండో వివాహం అని .గత కొంత కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాలు జరుగుతున్నట్లు చుట్టుపక్కల ప్రజలు చెబుతున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా టేకప్ చేస్తున్నారు.
హత్య చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు.పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.