వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టిన 32 నెలల బుడతడు

నల్లగొండ జిల్లా( Nalgonda District ):32 నెలల బుడతడు అందరినీ ఆశ్చర్యపరిచేలా 15 నిమిషాల్లో 150 పైగా సమాధానాలు చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సాధించాడు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓరుగంటి పవన్ కుమార్,రూపారేణుక దంపతుల కుమారుడు ఓరుగంటి రేయాన్ష్ (03) జనరల్ నాలెడ్జి విభాగంలో దేశాల,జంతువుల,పక్షుల, అంతరిక్షంలో గ్రహాల పేర్లు,జాతీయ చిహ్నాలు తడుముకోకుండా చెప్పి ఔరా అనిపించాడు.

ఆ చిచ్చర పిడుగుకు గురువారం నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి( Nalagonda District Collector Narayana Reddy ) మెడల్,సర్టిఫికెట్ అందజేశారు.

తెలంగాణలో యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు...!

Latest Nalgonda News