నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా 78,757 కుటుంబాలకు రుణమాఫీ:మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా( Nalgonda District )రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇస్తే ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారని,దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా రాహుల్ గాంధీ సారథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో అన్నదాతల ఆకాంక్షలు నెరవేర్చి చూపిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komati Reddy Venkata Reddy ) అన్నారు.గురువారం రైతు రుణమాఫీ అమలు చేసిన సందర్బంగా జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ నుండి ట్రాక్టర్ నడుపుకుంటూ ర్యాలీగా రైతు రుణమాఫీ కార్యక్రమ వేదిక ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకొని రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.

 Loan Waiver For 78,757 Families Through 83,121 Accounts In Nalgonda District: Mi-TeluguStop.com

నల్గొండ జిల్లాలో పండగ వాతావరణం ఉందని, రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారని, నేను స్వయంగా 5 కి.మీ.ట్రాక్టర్ నడుపుతూ వేదిక వద్దకు వస్తుంటే వేలాది మంది అన్నలు,తమ్ముళ్లు, అక్కలు,చెల్లెలు పరుగులు తీస్తూ వచ్చారని,వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మాటను నిజం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

రూ.2 లక్షల రుణమాఫీ హామీపై అనేక సందేహాలు వ్యక్తం చేశారని,కానీ, రాహుల్ గాంధీ ( Rahul Gandhi )ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతుల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సహకారం ఉంటుందన్నారు.నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా 78,757 కుటుంబాలు రుణమాఫీ పొందగా,ఇందు కోసం రూ.481.63 కోట్ల రూపాయలు కేటాయించారని,నల్గొండ నియోజకవర్గంలో 8,358 ఖాతాల ద్వారా 7,890 కుటుంబాలకు రుణమాఫీ జరిగగా ఇందుకోసం ప్రభుత్వం రూ.46.16 కోట్లు కేటాయించిందని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా రూ.లక్ష లోపు రుణాలు కలిగిన దాదాపు 11 కోట్ల కుటుంబాలకు 11.50 లక్షల ఖాతాల ద్వారా రూ.6,098 కోట్లు రుణాలు మాఫీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.మీ సహకారంతో ఇవ్వాల ఎసెల్బీసీ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గ్రీన్ ఛానల్ లో పెట్టి ముందుకు తీసుకుపోయేందుకు సహకరించిన సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు.మా జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు( Tummala Nageshwar Rao ) సహకారంతో మా జిల్లాకు రూ.481.63 కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా స్థానిక కలెక్టర్ నారాయణరెడ్డి,వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు మరియు పార్టీ నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube