మహేష్ ని ఆ హీరోయిన్ వాడుకుంటోందా?

సూపర్ స్టార్ మహేష్ - మురుగదాస్ సినిమాకి హీరోయిన్ దొరికేసిందా? శ్రద్ధాకపూర్, కీర్తి సురేష్, సాయి పల్లవిని కాదని, మహేష్, మురుగదాస్ పరిణీతి చోప్రాకి ఓటు వేసారా? నిజంగానే పరిణితి పేరుని పరిశీలిస్తున్నారా లేక పరిణీతి మహేష్ పేరుని వాడుకోవడానికి ప్రయత్నిస్తోందా?

విషయం ఏమిటంటే, పరిణీతి పరిస్థితి ఈమధ్య ఏమి బాగాలేదు.

లేకలేక "మేరి ప్యారి బిందు" అనే సినిమా ఒకటి తగిలింది.

అవకాశాల కోసం ఈ భామ బరువు తగ్గిన సంగతి కూడా తెలిసిందే.తెలుగు తమిళ మీడియా కన్నా ముందే, మహేష్ సరసన పరిణీతి అంటూ బాలివుడ్ మీడియా హంగామా మొదలుపెట్టింది.

చివరకి ఫిలింఫేర్ కూడా ఈ కథనం ప్రచూరించింది నిన్న.

Advertisement
మరి నిజంగానే పరిణీతి ఈ అవకాశం దక్కించుకుందా లేక ఇది పరిణీతి పీఆర్ టీమ్ కావాలని నడిపిస్తున్న గాలివార్తా? బాలివుడ్ లో ఈరకంగా మీడియాని వాడుకోడం సర్వసాధారణ విషయం.మహేష్ ఎలాగో దీనపై నోరువిప్పడు.

మరి మురుగదాసైనా నిజానిజాలేంటో చెప్పాలి.

తాజా వార్తలు