మురుగదాస్ కి వీరాభిమానులు గా మహేష్ ఫాన్స్

అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కష్టం ఎవరికీ తెలీదు.ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్ అయినా .

 Mahesh Fans Love On Murugadoss-TeluguStop.com

ప్రధాని నుంచి కలక్టర్ దాకా వారి కష్టం ఊరికినే తేరగా రాదు.ఎన్నో రోజుల రాత్రుల కష్టం దాగి ఉంటుంది.

డైరెక్టర్ మురుగదాస్ కి కూడా సామాన్య ఫ్లాష్ బ్యాక్ ఏమీ లేదు.గత ఆరు నెలల కాలం లో డైరెక్టర్ మురగదాస్ కొత్త సంవత్సర వేడుకలతో పాటు సంక్రాంతి వేడుకలు అదే సమయంలో వచ్చిన చెన్నై వరదలని కూడా పక్కన పెట్టి తన సినిమా పనిలో బిజీ గా ఉన్నారట.

అదీ ఆయన కమిట్మెంట్ అంటూ చెబుతున్నారు ఆయన సన్నిహితులు.

ఇదంతాకేవలం మహేష్ బాబు కోసం చేస్తున్న సినిమా స్క్రిప్ట్ పని.నిజానికి ఈ సినిమా కథను ఆర్నెల్ల క్రితమే లాక్ చేసారు.అప్పటి నుంచి స్క్రిప్ట్ ను మాత్రం ఫైన్ ట్యూన్ చేస్తూనే వున్నారట.

ఈ పనిలో అస్సలు విశ్రాంతి తీసుకోవడం లేదట.మురగదాస్ మాత్రమే కాదు.

ఆయన టీమ్ కూడా.తమిళులకు కీలకమైన సంక్రాంతి ని కూడా పట్టించుకోలేదట.

వరదలు, పండగలు కూడా పక్కన పెట్టి ప్రతీ సీన్ నీ నాలుగైదు సార్లు డిస్కస్ చేసుకుని మరీ ట్యూన్ చేసుకుంటూ రాస్తున్నారు అని మనకి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం.ష్యూరిటీ విషయంలో ఎవరూ తగ్గే పరిస్థితి లో లేరు .ఇది తెలుసుకున్న మహేష్ ఫాన్స్ మురుగదాస్ మీద విపరీతమైన అభిమానం పెంచుకుంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube