బాహుబలి ప్రభంజనం త్వరలో మరికొన్ని దేశాల్ని తాకబోతోంది.బాహుబలిని అంతర్జాతీయ వేదికపై తీసుకెళ్లేందుకు ఫ్రాన్కోసిస్ డసిల్వా అనే మార్కెటింగ్ జీనియస్ ని నియమించుకుంది బాహుబలి యూనిట్.
ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్నేషనల్ పోస్టర్ ని ఈరోజు విడుదల చేసారు ఆయన.ఈ సందర్భంగా బాహుబలి త్వరలోనే చైనా, జపాన్, దక్షిణ ఆసియా దేశాలతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల కానుంది అని ప్రకటించారు.
చైనాలో రికార్డు స్థాయిలో 5 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు డసిల్వా.ఇది చైనాలో ఆమీర్ ఖాన్ సినిమాల కన్నా పెద్ద విడుదల.
సరికొత రికార్డు.అంతర్జాతీయ వెర్షన్ లో భారి మార్పులే చేసారు.
నిడివి చాలావరకు తగ్గించి, ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ఇంటర్నేషనల్ వెర్షన్ ఎడిటింగ్ జరుగుతోంది.
ఇప్పటికే ఈ ఇంటర్నేషనల్ వెర్షన్ కి సంబంధించి వివిధ దేశాల్లోని 30 ట్రేడ్ ఏరియాల్లో పంపినిదారులు ఎగబడి హక్కులను సొంతం చేసుకున్నారు.
ఈ రకంగా భారతదేశంలో అధికంగా అమ్ముడుపోయిన చిత్రంగా బాహుబలి నిలువనుంది.ఇక మిగిలింది వేరే దేశాల్లో కూడా మంచి టాక్ సొంతం చేసుకోని ఆమీర్ ఖాన్ పీకే రికార్డులను బద్దలు కొట్టడమే.







