పవన్ కి పోటిగా వెళ్తున్న అల్లు అర్జున్ ?

ఎంతవరకు నిజమో తెలియదు కాని అల్లు అర్జున్ సరిగ్గా వెళ్లి పవర్ స్టార్ తో డీ అంటే డీ అంటున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సరైనోడు మొదట మార్చిలో వస్తుందని అన్నారు.

ఆ తరువాత ఏప్రిల్ కి షిఫ్ట్ చేసారు.నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా ముందే ఏప్రిల్ 8 మీద కన్నేశాడు అల్లు అర్జున్.

తన గత రెండు చిత్రాలు రేసుగుర్రం ఎప్రిల్ 11న విడుదల కాగా, సన్నాఫ్ సత్యమూర్తి ఎప్రిల్ 9 న విడుదల అయ్యింది.ఈ రెండు చిత్రాలు మంచి కలెక్షన్లు రాబట్టుకోవడంతో ఈ ఏప్రిల్ సీజన్ సెంటిమెంట్ గా మారింది అల్లు అర్జున్ కి.

కాని సరిగ్గా ఏప్రిల్ 8 మీదే పవన్ కళ్యాన్ కూడా కన్నేశాడు.సర్దార్ గబ్బర్ సింగ్ ని పంపిణి చేయబోతున్న ఎరోస్ ఇంటర్నేష్నల్ సంస్థ సర్దార్ విడుదల తేదిని ఏప్రిల్ 8గా ప్రకటించింది.

Advertisement

సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్ లో విడుదల తేది లేకపోయినా, ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఇప్పుడు ఆ ఏప్రిల్ 8 వ తేదిని త్యాగం చేసేదెవరు, దాన్నే పట్టుకొని వేలాడేదెవరు ?

అల్లు అర్జున్ తన సెంటిమెంట్ కోసం పవన్ కళ్యాన్ కి పోటిగా వెళ్తాడా ? వెళ్తే నిలుస్తాడా ?

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి

తాజా వార్తలు