అందరు వస్తున్నారు , పవన్ కళ్యాణ్ తప్ప

బ్రహ్మోత్సవం కన్నా ముందే, సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త టీజర్ ఈ నూతన సంవత్సర కానుకగా విడుదల చేస్తారని గాసిప్పులు మొదలయ్యాయి.

దాన్ని పట్టుకొని, ఆ యూనిట్ కి టీజర్ విడుదల చేయమని విన్నవించుకున్నారు కుడా పవర్ స్టార్ ఫ్యాన్స్.

పవన్ ఫ్యాన్స్ ఆశలు పెరిగాయి.కాని పవన్ స్టార్ నుంచి బహుమతి మాత్రం రావట్లేదు.

సూపర్ స్టార్ అభిమానులు రేపటి నుంచే సంక్రాంతి పండగను జరుపుకోనున్నారు.రేపు ఉదయం సరిగ్గా 9:36 నిమిషాలకు బ్రహ్మోత్సవం మొదటి టీజర్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఆ చిత్ర యూనిట్.త్రివిక్రమ్ అఆ, సాయి ధరం తేజ్ సుప్రీం ఫస్ట్ లుక్ ఈ రోజు రాత్రి వస్తుండగా, సరైనోడు తన ప్రమోషన్స్ సంక్రాంతి నుంచి మొదలుపెడతాడని ప్రకటించింది గీత ఆర్ట్స్.

బోయపాటి శ్రీను అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేసారని సమాచారం.ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలైనా, కొత్త టీజర్ తో కొత్త ఏడాదిని మొదలుపెడతారని ఆశించారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

Advertisement

చివరకి నిరాశే మిగిలేలా ఉంది.అందరు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ తప్ప.

బాబి దర్శకత్వం వహిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ కి శరత్ మరార్ నిర్మాత.కాజల్ కథానాయిక.

దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.మే 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు