ఇక చాలు అంటున్న రామ్ చరణ్

రామ్ చరణ్ కెరీర్ ను పరిశీలిస్తే అరేంజ్ అనే సినిమా తప్ప మిగితావాన్ని కమర్షియల్ సినిమాలే.

ఒకేరకమైన సినిమాలు చేస్తాడు, నటనలో కొత్తదనం ఉండదు , ఇవి తరచుగా రామ్ చరణ్ పై వినబడే కామెంట్స్.

ఆ నోట, ఈ నోట ఇవి రామ్ చరణ్ చెవిన పడ్డట్టున్నాయి.మార్పు కోరుకుంటున్నాడు చరణ్.

నిజానికి బ్రూస్ లీ ఆగడు తో పోల్చుకుంటే అంత చెత్త సినిమా కాదు.కాని రామ్ చరణ్ ఇమేజ్ వల్ల విసిగిపోయారు ఆడియెన్స్.

అదే ప్రభావం బ్రూస్ లీ కలెక్షన్లపై పడింది.టాక్ బయటకు రాకముందే థియేటర్ల వద్ద జనాలు కరువైపోయారు అందుకే.

Advertisement

ఇదంతా చూసి రామ్ చరణ్ పెద్ద గుణపాఠం నేర్చుకున్నాడు.ఒక ప్రముఖ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ " నేను ఇప్పటికే చాలా కమర్షియల్ సినిమాలు చేసేసాను.

ఇక చాలు అవి.ఒకేరకమైన కథలు చేసి బోర్ కొట్టేసింది.ఇకనుంచి కథలో కొత్తదనం, నా క్యారెక్టర్ చాలెంజింగ్ గా ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటాను.

నా తదుపరి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది.నా గత చిత్రాలకు, ముఖ్యంగా బ్రూస్ లీ కి చాలా భిన్నంగా ఉంటుంది.

" అంటూ ఫ్యూచర్ ప్లాన్ బయటపెట్టాడు చరణ్.తమిళ హిట్ చిత్రం తని ఒరువన్ ని రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు