మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది.
చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్‌తో ఈ సినిమాకు కలిసి వచ్చింది.దసరాకు ముందు వచ్చిన ఈ చిత్రానికి ఈనెల 22న విడుదల కాబోతున్న మూడు చిత్రాలు గట్టి పోటీనే ఇవ్వబోతున్నాయి.
అందులో ముఖ్యంగా ‘కంచె’ చిత్రం నుండి ‘బ్రూస్‌లీ’ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
చరణ్‌కు ఉన్నంత క్రేజ్ లేక పోయినా కూడా ‘కంచె’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దర్శకుడు క్రిష్‌కు సినీ వర్గాల్లో మంచి పేరు ఉంది.దానికి తోడు ఇప్పటికే విడుదలైన ‘కంచె’ ట్రైలర్ మరియు ఆడియో సూపర్ హిట్ అవ్వడంతో సినిమా కూడా సక్సెస్‌ను దక్కించుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.
‘కంచె’ సక్సెస్ అయితే ‘బ్రూస్‌లీ’ పని ఇక అంతే అని ట్రేడ్ పండితులు అంటున్నారు.‘కంచె’తో పాటు కళ్యాణ్ రామ్ ‘షేర్’ మరియు ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజుగారి గది’ చిత్రాలు కూడా యావరేజ్‌గా ఉన్నా కూడా ‘బ్రూస్‌లీ’ కలెక్షన్స్‌కు పెద్ద గండి తప్పదు.
దాంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోవడం ఖాయం అని అంటున్నారు.‘కంచె’ను వాయిదా వేయించే ప్రయత్నం చేయాల్సిందిగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు చరణ్‌ను కోరేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.







