నాగ్‌ ప్రకటించినా శాంతించడం లేదు

అక్కినేని ఫ్యాన్స్‌ ‘అఖిల్‌’ చిత్ర యూనిట్‌ సభ్యులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.దసరా కానుకగా ఈనెల 22న ‘అఖిల్‌’ చిత్రాన్ని విడుదల చేస్తాం అంటూ ప్రకటించిన నిర్మాత నితిన్‌ మరియు దర్శకుడు వినాయక్‌ ఇప్పుడు మాట తప్పి వాయిదా వేయడంతో అక్కినేని ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురై ఆగ్రహంతో ఉన్నారు.

 Akkineni Fans Angry On Akhil Movie Unit-TeluguStop.com

ఫ్యాన్స్‌ కోపాన్ని చల్లర్చేందుకు నాగార్జునతో చిత్ర నిర్మాత దర్శకుడు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తి కానందు వల్లే ‘అఖిల్‌’ చిత్రాన్ని స్వల్ప కాలం వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా నాగార్జున ప్రకటించాడు.

నాగార్జున ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్‌ శాంతించడం లేదు.‘అఖిల్‌’ చిత్రంపై తాము ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నామని, ఇలా చిన్న కారణానికి వాయిదా వేయడం చెడు సందేశాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్తుందని అంటున్నారు.

మెగా హీరో రామ్‌చరణ్‌కు భయపడి ‘అఖిల్‌’ను వాయిదా వేశారనే చర్చ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో జరుగుతుండటంతో ఫ్యాన్స్‌ కోపం మరింతగా పెరుగుతోంది.మెగా హీరోల మూవీ స్థాయిలో ‘అఖిల్‌’ మూవీ ఉంటుందని ఆశిస్తున్న సమయంలో వాయిదా పడటం బాధాకరంగా ఉందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube