ఓవర్సీస్ భూతం రామ్ చరణ్ ని ఇంకా వెంటాడుతూనే ఉంది.ఇన్ని రోజులు డిస్ట్రిబ్యుటర్స్ తప్పని, ఇమేజ్ ఉన్న డైరెక్టర్స్ లేరని, రకరకాల సాకులతో తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసే మేగాఫ్యాన్స్ ఈసారి ఏ సాకు వెతుక్కోకుండా చేసాడు చరణ్.
ఓవర్సీస్ పంపిణిదారులు గ్రేట్ ఇండియా ఫిలిమ్స్, ఓవర్సీస్ మార్కెట్ లో వీరిని మించినవారు లేరు, దర్శకుడు శ్రీనువైట్ల, ఓవర్సీస్ లో మంచి ఇమేజ్ ఉన్న డైరెక్టర్.బాహుబలి కన్నా పెద్ద రిలీజ్ అక్కడ.
శ్రీమంతుడు కన్నా ఎక్కువ టికెట్ రేట్స్ అక్కడ కుడా.మరి ఏమైంది ?
సినిమా టాక్ తెలియకముందే జరిగే ప్రిమియర్స్ కి కుడా జనాలు కరువయ్యారు.ఒక థియేటర్ లో పది మంది ఉంటె మరో థియేటర్ పాతిక.పెద్ద రిలీజ్ ఉంటె సరిపోదు, చూసేందుకు జనాలు కుడా రావాలి.తిప్పి తిప్పి కొడితే 300 వేల డాలర్లు కుడా రాలేదు.ప్రిమియర్స్ కి మొదటి రోజు కలెక్షన్లు జత చేసినా సరే శ్రీమంతుడు కేవలం శ్రీమంతుడు ప్రిమియర్స్ మొత్తాన్ని కుడా సాధించలేదు బ్రూస్ లీ.
సరే, మహేష్ తో ఎందుకు పోల్చడం అనుకుంటే, నాని కుడా మిలియన్ డాలర్లు కొట్టేసాడు.బ్రూస్ లీ కుడా మిలయన్ డాలర్లు కొట్టడం చాలా కష్టం.
మరి చరణ్ ఎప్పుడు కొడతాడు ?







