మహేష్ సరసన బాలివుడ్ హీరోయిన్ ?

మహేష్ బాబు బాలివుడ్ హీరోయిన్స్ తో సినిమాలు చేయడం కొత్తేమి కాదు.తొలిచిత్రం రాజకుమారుడు చిత్రంలోనే బాలివుడ్ టాప్ హీరోయిన్ ప్రీతి జింట తో జత కట్టాడు ప్రిన్స్.

 Bollywood Actress To Be Roped In For Mahesh ?-TeluguStop.com

టక్కరిదొంగ లో నటించిన లిసా రే హాలివుడ్ భామ, బిపాషా బసు బాలివుడ్ బొమ్మ.అతిధిలో నటించిన అమృత రావుది కుడా బాలివుడే.

మరోమారు సూపర్ స్టార్ బాలివుడ్ గుమ్మతో జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో బాలివుడ్ బబ్లి బ్యూటి ఆలియాభట్ ని కథానాయికగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.ఈ చిత్రం తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కుడా విడుదల చేస్తారని టాక్.

అలియా భట్ ఉంటె హిందీలో అదనపు ఆకర్షణ అవుతుందని మురగదాస్ ప్లాన్.

ఈ వార్తాలు నిజామా లేక గాలివార్తలా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

బ్రహ్మోత్సవం తరువాత మొదలవబోతున్న ఈ చిత్రానికి ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube