స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు గతంలో వచ్చిన పాటలను రీమిక్స్ చేయడం ప్రస్తుతం ట్రెండ్‌గా సాగుతున్న విషయం తెల్సిందే.మెగా హీరోలు పలువురు ఇప్పటికే ఈ పద్దతిని ఫాలో అయ్యి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
అల్లరి నరేష్, సుధీర్‌బాఋ కూడా రీమిక్స్ దారిలో నడిచారు.అదే దారిలో అనుష్క కూడా నడువనుంది.
అనుష్క ప్రస్తుతం నటిస్తున్న ‘సైజ్ జీరో’ చిత్రంలో ఒక రీమిక్స్ సాంగ్‌ను పెట్టినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కమల్ హాసన్ సూపర్ హిట్ సినిమా ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలోని సన్నాజాజి పాడక.
పాటను రీమిక్స్ చేయనున్నారు.
అనుష్క, ఆర్య జంటగా నటించిన ‘సైజ్ జీరో’ సినిమాకు ట్యాగ్ లైన్‌గా సన్నజాజి నడుము అంటూ మొదటి నుండి కూడా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ క్రమంలో సన్నాజాజి పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలో కమల్ హాసన్, రేవతిల మధ్య ఎలా అయితే చిత్రీకరణ జరిగిందో, అచ్చు అలాగే ఈ సినిమాలో కూడా పాట చిత్రీకరణ అలాగే ఉంటుందని, పాట ట్యూన్ కూడా ఏమాత్రం మార్చకుండా దాన్నే వాడేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
రొమాంటిక్‌గా సాగే ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.ఈ సినిమా ఆడియో ఈనెల 6న విడుదల కానుండగా, చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్దం అవుతోంది.







