పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.మధ్యలో ‘గోపాల గోపాల’ సినిమా వచ్చినా కూడా ఫ్యాన్స్ ఆ సినిమాను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు.
‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రంగా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆ సినిమా వచ్చి చాలా కాలం అయిన తర్వాత వస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు తారా స్థాయిలో ఎదురు చూస్తున్నారు అనే విషయం తాజాగా తేలిపోయింది.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కొన్ని వర్గాల ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఈయనకు దూరం అయ్యారు అనే టాక్ వినిపించింది.దాంతో పవన్‌కు మునుపటి క్రేజ్ ఉండదని, ఆయన సినిమాలు ఇకపై ఆ స్థాయిలో ఆడవు అంటూ కొందరు ప్రచారం చేశారు.
కాని తాజాగా విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ టీజర్ ఆ వార్తలను తన్ని తరిమేసింది.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్‌గా కనిపించబోతున్నాడు.
టీజర్‌కు వచ్చిన స్పందన చూసి సినీ వర్గాల వారు సైతం ఆశ్చర్యపోతున్నారు.కేవలం 24 గంటల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని తేల్చి చెప్పింది.







