విడుదలకు ముందే సూపర్‌ హిట్‌!!

కొన్ని సినిమాలు విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలను తెచ్చి పెడతాయి.అయితే విడుదల తర్వాత ఆ సినిమాల ఫలితాలు అటు ఇటు అయ్యే ఛాన్స్‌ ఉంది.

 Bhale Bhale Magadivoy Got Positive Talk-TeluguStop.com

మరి కొన్ని సినిమాలు విడుదలకు ముందు నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టినా, పెట్టకున్నా, సక్సెస్‌ టాక్‌ను తెచ్చుకుంటాయి.విడుదల తర్వాత ఆ సినిమాలు తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటాయి.

ఇక్కడ రెండో రకం విజయాన్ని నాని తాజా చిత్రం ‘భలే భలే మొగాడివోయ్‌’ దక్కించుకుంది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భలే భలే మొగాడివోయ్‌’ చిత్రంలో నానికి జోడీగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది.

రెండు పెద్ద నిర్మాణ సంస్థలు అయిన గీతాఆర్ట్స్‌2 మరియు యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కడం ఈ సినిమాకు మొదటి సక్సెస్‌ తెచ్చి పెట్టింది.ఆ తర్వాత ఆడియో మరియు టీజర్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో రెండవ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడంతో ఈ సినిమా విడుదలకు ముందే సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నట్లుగా సినీ విశ్లేషకులు అంటున్నారు.బూతు చిత్రాల దర్శకుడిగా పేరున్న మారుతి తెరకెక్కించిన ఈ సినిమాకు క్లీన్‌ యూ రావడం కూడా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.

ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube