ఇంకా మొదటి చిత్రమే పూర్తి కాలేదు.సినిమా విడుదల తేది ఖరారు కాలేదు.
కుర్రాడు జనాలకి తన సత్తా ఏంటో చాటనేలేదు.కాని అప్పుడే అఖిల్ వైపు అవకాశాలు వెళ్తున్నాయి.
గట్టిగా చెబితే వెంటబడుతున్నాయి.దానయ్య,శ్రీనువైట్ల,పూరి జగన్నాధ్ .ఇప్పటి వరకు అఖిల్ తరువాత చేయబోయే సినిమాల నిర్మాత దర్శకులు.ఇప్పుడు ఈ లిస్టు లోకి ఇంకో పేరు వచ్చింది… బండ్ల గణేష్.
అవును, నిర్మాత బండ్ల గణేష్ అఖిల్ తో సినిమా తీసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు.పూరి జగన్నాధ్ తో అనుకుంటున్న చిత్రాన్నే బండ్ల గణేష్ నిర్మించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
దీని మీద ఇప్పటికే చర్చలు జరిగాయట.
ప్రసుతం లోఫర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న పూరి, ఆ వెంటనే దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
చిరంజీవి సినిమా ఇంకా ఖరారు కాకపోవడం, మహేష్ వేరే సినిమాలు ఒప్పుకోవడంతో పూరి అఖిల్ మీద పడ్డట్లు తెలుస్తోంది.
అయితే అఖిల్ మనోగతం ఇంకా బయటపడలేదు.
బ్రూస్లీ తర్వాత శ్రీను వైట్ల అఖిల్ కి కథ రాస్తారని మరోవైపు టాక్.ఏది ముందు తర్వాత అయినా .శ్రీను వైట్ల, పూరి .అఖిల్ తదుపరి రెండు సినిమాల దర్శకులు.దానయ్య, బండ్ల గణేష్ నిర్మాతలు.







