సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం యమ సంతోషంగా ఉన్నాడు.ఈయన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ భారీ విజయం సాధించడంతో మహేష్‌బాబు డబుల్ హ్యాపీగా ఉన్నాడు.
మహేష్ డబుల్ హ్యాపీకి కారణం ఈ సినిమా ఆయనకు రెండు విధాలుగా సక్సెస్‌ను ఇచ్చింది.అందులో మొదటిది హీరోగా కాగా, రెండవది నిర్మాతగా.
ఈ సినిమాతో మహేష్‌బాబు మొదటి సారి నిర్మాతగా తెరంగేట్రం చేసిన విషయం తెల్సిందే.
భారీ అంచనాలున్న ‘శ్రీమంతుడు’ భారీ విజయం సాధించడంతో పాటు కేవలం అయిదు రోజుల్లోనే 50 కోట్లు వసూళ్లు చేసి రికార్డులు సృష్టించింది.
‘బాహుబలి’ సినిమా తర్వాత ఒక తెలుగు సినిమా ఇంతగా కలెక్షన్స్‌ను వసూళ్లు చేయడం ఇదే.లాంగ్ రన్‌లో ఈ సినిమా 100 కోట్లు వసూళ్లు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ సినీ వర్గాల వారు మరియు ట్రేడ్ పండితులు అంటున్నారు.దాంతో మహేష్‌బాబుకు లాభాల పంట పడంనుంది.అందువల్లే ఈ సినిమాకు పని చేసిన కొంత మంది ముఖ్య పేద టెక్నీషియన్స్‌కు మహేష్‌బాబు ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
తమిళ హీరోలు ఇలా చిత్ర యూనిట్‌కు బహుమతులు ఇస్తారు.అయితే మహేష్‌బాబు ఇలా ఇవ్వడం టాలీవుడ్‌లో మొదటి సారి.మరి ఇది ఇతర హీరోలకు సైతం ఇన్సిపిరేషన్‌గా ఉంటుందో చూడాలి.







