ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ లండన్‌లో దారి తప్పి చిత్ర యూనిట్ సభ్యులను కాసేపు కంగారు పెట్టింది.చిత్ర యూనిట్ సభ్యులను కంగారు పెట్టడంతో ఆమె కూడా కంగారు పడి ఏం చేయాలో తెలియక అయోమయంకు గురైంది.
విషయానికి వస్తే ప్రస్తుతం రకుల్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమా లండన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
చిత్రీకరణలో భాగంగా లండన్ వీధుల్లో రకుల్ కారు నడిపే సీన్ ఉంటుంది.ఒంటరిగా కారు నడుపుతూ రెండు వీధుల్లో రకుల్ వెళ్లాల్సి ఉంది.
కెమెరాను కారుకు ఫిట్ చేసి ఒక రైట్, ఒక లెఫ్ట్ తీసుకుంటే మళ్లీ స్పాట్‌కు చేరుకోవచ్చు అంటూ దర్శకుడు రకుల్‌కు చెప్పి పంపించాడు.అయితే ఆమె మాత్రం దర్శకుడు చెప్పిన విధంగా కాకుండా మరే దారిలో వెళ్లిందో కాని కొంత సమయం వరకు కనిపించకుండా పోయింది.
ఫోన్ కూడా లేక పోవడంతో చాలా ఇబ్బంది పడ్డట్లుగా రకుల్ చెబుతోంది.ఈ సంఘటనను గుర్తు చేసుకుంటే భయంగా ఉంది అంటూ రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.







