రాజ్యసభకు విజయమ్మ?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ రాజ్యసభకు వెళతారని సమాచారం.

గత లోక్ సభ ఎన్న్హికల్లో విశాఖపట్నం నుండి పోటీ చేసి పరాజయం పొందిన సంగతి తెలిసిందే.

అప్పట్లో తల్లి గెలవలేకపోయినందుకు జగన్ చాలా బాధ పడ్డారు .ఎన్నికలు ముగిసినప్పటి నుంచి విజయమ్మ మౌనంగానే ఉన్నారు.

అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడటానికి విజయమ్మ చేసిన కృషి అందరికి తెలుసు.కూతురు షర్మిల ఆమెకు అండగా ఉండి ఉమ్మడి రాష్ట్రంలో విస్తారంగా పర్యటించారు.

మధ్యలో ఒకసారి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం యమ ప్రచారం చేసారు.కుమారుడు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Advertisement

విజయమ్మ పార్టీ గౌరవ ప్రెసిడెంట్ అయినా ఎలాంటి కార్యకలాపాలలో పాల్గొనడంలేదు.అయితే తానూ మళ్ళీ రాజకీయాల్లో బిజీ కావాలని అనుకుంటున్నారని సమాచారం.

దీనిపై కొడుకుతో మాట్లాడారని, దీంతో తల్లిని పెద్దల సభకు పంపడానికి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.రాజకీయాలకు వయసుతో పని లేదు కదా.

Advertisement

తాజా వార్తలు