నటకిరీటి ‘మా’ విజేత

మా అధ్యక్ష ఎన్నికలు ఈసారి హోరా హోరీ సాగిన విషయం తెల్సిందే.

సాదారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మరియు సహజ నటి జయసుధలు పోటీ పడ్డారు.

వీరిద్దరితో పాటు, వారి మద్దతు దారులు, ప్యానల్‌ సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.వ్యక్తిగత దుషణలకు కూడా తెర తీశారు.

ఇంత హంగామాగా సాగిన ఎన్నికల ఫలితాలు కోర్టు కేసు వల్ల దాదాపుగా 50 రోజుల పాటు వాయిదా పడుతూ వచ్చాయి.ఎట్టకేలకు నేడు మా అధ్యక్ష ఫలితాలు వెళువడ్డాయి.ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.87 ఓట్ల భారీ తేడాతో రాజేంద్రుడు తన ప్రత్యర్థి జయసుధపై ఘన విజయం సాధించాడు.ఈ విజయంతో రాజేంద్ర ప్రసాద్‌ మద్దతుదారులు ఆనందోత్సాహంలో మునిగి పోయారు.

రాజేంద్ర ప్రసాద్‌ ప్యానల్‌కు చెందిన అయిదుగురు సభ్యులు విజయం సాధించారు.మా కార్యదర్శిగా పోటీ పడ్డ అలీ, శివాజీ రాజాల్లో రాజేంద్ర ప్రసాద్‌ ప్యానెల్‌కు చెందిన శివాజీ రాజా గెలుపొందారు.

Advertisement

మురళి మోహన్‌ ఈ ఎన్నికల్లో జయసుధకు మరియు ఆమె ప్యానెల్‌కు మద్దతు తెలపడం జరిగింది.ఆయన మద్దతు వల్లే జయసుధ ఓడి పోయి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

చాలా సంవత్సరాల పాటు మా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు నిర్వహించిన మురళి మోహన్‌పై వ్యతిరేకత ఉంది.ఆ వ్యతిరేకత వల్లే ఆయన మద్దతు ఇచ్చిన జయసుధకు ఓట్లు వేయలేదు.

మెగా ఫ్యామిలీ ఇచ్చిన మద్దతు రాజేంద్ర ప్రసాద్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు