సంపూర్నేష్‌బాబు.ఈ పేరు వింటే నవ్వు వస్తుంది.
ఈయన నటించిన ‘హృదయ కాలేయం’ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయనకు పేరడీ హీరోగా గుర్తింపు వచ్చింది.ఇతర హీరోల సినిమాల్లో కూడా కమెడియన్స్ పాత్రలు చేసిన సంపూ ప్రస్తుతం ‘సింగం 123’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
మంచు విష్ణు నిర్మిస్తున్న ఆ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టీజర్‌లో సంపూ చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకుల నుండి విజిల్స్ వస్తున్నాయంటూ అతిశయోక్తి కాదు.
ఇక ఆ టీజర్‌లో మరో ఆసక్తికర అంశం చర్చనీయాంశం అయ్యింది.
సంపూర్నేష్‌బాబును టీజర్‌లో మెగా బర్నింగ్ సూపర్‌స్టార్ అంటూ సంభోదించడం అందరిని ఆశ్చర్య పర్చుతోంది.
ఇప్పటికే బర్నింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంపూ ఈ సినిమా తర్వాత మెగా హీరోగా, సూపర్ స్టార్‌గా కూడా ప్రేక్షకులు గుర్తిస్తారేమో చూడాలి.టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు భారీగా వచ్చాయి.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు.కామెడీతో సంపూ చంపేయడం ఖాయం అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ సినిమాకు అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.







