వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మొదటి సినిమా ‘శివ’.అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
అప్పటి వరకు ఉన్న మూస పద్దతికి స్వస్థి చెప్పి వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.ఆ సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్బంగా మరోసారి ‘శివ’ మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు.
‘శివ’ సినిమాను డిజిటల్ చేయడంతో పాటు డీటీఎస్ సౌండ్ సిస్టమ్‌లోకి మార్చారు.
గత కొన్ని రోజులుగా ‘శివ’కు ఈ పనులు జరుగుతున్నాయి.కలర్స్‌ను కూడా మార్చుతున్నట్లుగా చెబుతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు అన్నపూర్ణ స్టూడియో సొంతంగా తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.మే 15న ఈ సినిమాను దాదాపు 100 థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
‘శివ’కు కొత్త హంగులు అద్దేందుకు దాదాపు అయిదు కోట్లు ఖర్చు చేసినట్లుగా సినీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది.మళ్లీ రాబోతున్న ‘శివ’ మూవీని ప్రేక్షకులు ఆధరిస్తారో లేదో చూడాలి.







