రామ్‌గోపాల్ వర్మ మరోసారి ప్రయోగాత్మక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌లలో పలు వైవిధ్యభరిత సినిమాలను అందించిన వర్మ ఈసారి మూకీ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించాడు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు.ప్రస్తుత టాకీ సమయంలో మూకీ సినిమాలు ఎవరు చూస్తారని అంతా అనుకుంటున్నా కూడా, వర్మ మాత్రం తాను మూకీ సినిమా చేసి, అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఆకట్టుకుంటాను అంటూ చెబుతున్నాడు.
ప్రస్తుతం వర్మ తెలుగులో మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఉన్నాడు.ఆ సినిమాలు అన్ని పూర్తి కాగానే మూకీ సినిమాపై శ్రద్ద పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
కామెడీ హర్రర్ కథాంశంతో ఈ సినిమాను వర్మ తెరకెక్కించబోతున్నాడు.మాటలు లేకండా కామెడీ మరియు హర్రర్ సినిమా చేయడం అంటే అంత సులువేం కాదు.
అయితే వర్మ ఈ సినిమాను చాలెంజ్‌గా తీసుకుని తెరకెక్కిస్తాను అంటున్నాడు.గతంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘పుష్పక విమానం’ అనే మూకీ సినిమా వచ్చిన విషయం తెల్సిందే.
ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక వర్మ తెరకెక్కించబోతున్న ఈ ‘సైలెంట్’ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
చెప్పలేదు కదూ… ఈ సినిమాకు వర్మ టైటిల్‌గా ‘సైలెంట్’గా ఖరారు చేశాడు.







