కాజల్‌ వింత కోరిక

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌కు ప్రస్తుతం ఆఫర్లే లేకుండా ఉంది.

నిన్న మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో నటిస్తూ, యమ బిజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం అవకాశాలు లేక దిక్కులు చూస్తోంది.

ఈ అమ్మడు చేసిన సినిమాలు సక్సెస్‌ అయినా కూడా ఈమెకు ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు.ఈమె తాజాగా నటించిన ‘టెంపర్‌’ సినిమా భారీ సక్సెస్‌ అయ్యింది.

అయినా కూడా ఆ సినిమా విడుదలైన తర్వాత ఏ ఒక్క సినిమాలో కూడా ఈమె బుక్‌ అయ్యింది లేదు.దాంతో కాజల్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది.

హీరోయిన్‌గా ఆఫర్లు రాని కాజల్‌ ఇకపై ఐటెం సాంగ్స్‌ను చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించింది.హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో వచ్చిన పలు ఐటెం ఆఫర్లను తోసి పుచ్చిన కాజల్‌ ఇప్పుడు ఐటెం సాంగ్స్‌ చేసేందుకు ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంది.

Advertisement

మరి అవకాశం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది అంటారు.ఇప్పటికే ఐటెం ఆఫర్లు కాజల్‌ తలుపు తట్టాయి.

మరోసారి ఈ అమ్మడికి ఐటెం ఆఫర్లు వస్తాయేమో చూడాలి.తమిళంలో ఇటీవలే ఒక సినిమాలో హీరోయిన్‌గా బుక్‌ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇంకా ఆ సినిమాకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు