"అమ్మకు" గవర్నర్ ఇస్తారట!!

ఉత్తర భారత దేశంలో.అందులోనూ తమిళ నాడులో పాగా వేసేందుకు పావులు కదుపుతుంది కమలం పార్టీ.

దీనిలో భాగంగానే తమను వ్యతిరేకిస్తున్న పార్టీలో ప్రధానమైన వారిని సైతం వదలడం లేదు.ఇదిలా ఉంటే.

తాజాగా వస్తున్న వార్తలు చూస్తే.అన్నాడీఎంకే అధినేత్ర జయలలితకు బంపర్ ఆఫర్ ఇచ్చారట కమలనాథులు.

రానున్నన తమిళనాడు ఎన్నికల్లో తమను కలుపుకొని పోతే మీకు కచ్చితంగా ఉపయోగం ఉంటుందని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రతిపాదించారట.తమిళనాడులో తమ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళితే కేంద్రం పరపతిని ఉపయోగించుకొని అమ్మకు మేలు జరిగేలా చూస్తామని కమలనాథులు అంటున్నారట.

Advertisement

జయలలిత ఇప్పుడు కొంత ఇబ్బందుల్లో ఉంది.ఆమె అక్రమాస్తుల కేసులో దోషి అని నిర్ధారణ అయ్యింది.

దీంతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది.తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తక్కువే.

ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి అవకాశం లేని జయను వేరే రాష్ట్రానికి గవర్నర్ ను చేస్తామని కమలనాథులు చెబుతున్నారట.ఒకవేళ అవకాశం ఉంటే.

కోర్టు సమ్మతిస్తే తిరిగి అమ్మ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి ఓకే.అని లేకపోతే, ఆమెకు గవర్నర్ గిరిని అప్పగించి సంతోషపెడతామని కమలనాథులు హామీ ఇస్తున్నారట.అయితే అ ప్రతిపాదనకు అమ్మ ఓకే చెబుతుందా? అనేదే కొంత సందేహం.అయితే దీనిపై జయ ఆలోచన ఏంటో అనేది ఇంకా తెలియలేదు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు