టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన హన్సికకు( Hansika ) సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.హన్సికకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.
అయితే ఈ ప్రముఖ హీరోయిన్ తాజాగా బాంబే హైకోర్టును( Bombay High Court ) ఆశ్రయించారు.తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలని హన్సిక కోరారు.
బాంబే హైకోర్టులో హన్సిక క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.
హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ నాన్సీ( Muskan Nancy ) హన్సిక ఫ్యామిలీపై గృహ హింస కేసును నమోదు చేశారు.
గతేడాది డిసెంబర్ నెల 18వ తేదీన ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం.ముస్కాన్ తన ఆరోపణల్లో హన్సిక, తన తల్లి తమ వివాహం, రిలేషన్ షిప్ విషయంలో జోక్యం చేసుకుని మనస్పర్ధలు వచ్చేలా చేశారని హన్సిక అన్నారు.

ఈ పరిస్థితుల వల్ల తాను బెల్ ఫాల్సీ వ్యాధి బారిన పడ్డానని హన్సిక కామెంట్లు చేశారు.ఆస్తి లావాదేవీలకు సంబంధించి హన్సిక, అత్త మోసపూరిత లావాదేవీలకు పాల్పడుతున్నారని తెలిపింది.అయితే హన్సిక, ఆమె తల్లి తమపై నమోదైన 498 ఏ కేసును రద్దు చేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తులు ముస్కాన్ నాన్సీకి నోటీసులు జారీ చేశారు.

ముస్కాన్ నాన్సీ సైతం టీవీ నటి కాగా ఆమె సైతం తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.2021 సంవత్సరంలో ముస్కాన్, ప్రశాంత్ వివాహం జరిగింది.2022 సంవత్సరంలో ఈ జంట విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.హన్సిక ఈ కేసు నుంచి రాబోయే రోజుల్లో అయినా బయటపడతారేమో చూడాల్సి ఉంది.
హన్సిక తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.హన్సిక కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.