ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.23
సూర్యాస్తమయం: సాయంత్రం.6.27
రాహుకాలం: సా.3.00 సా4.30
అమృత ఘడియలు: చవితి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12
రా.10.46 ల11.36
మేషం:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం:

ఈరోజు నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిథునం:

ఈరోజు ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు.
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.
కర్కాటకం:

ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు.
నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.దూర ప్రయాణాలు చేస్తారు.
ఆలయ దర్శనాలు చేసుకుంటారు.ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
సింహం:

ఈరోజు దాయాదులతో భూ సంభందిత వివాదాలు నుండి బయటపడతారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు.గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు.
కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.
మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.
కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉన్నాయి.ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.
తుల:

ఈరోజు ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి.కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృశ్చికం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.
నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
ధనుస్సు:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.
నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
మకరం:

ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
కుంభం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
మీనం:

ఈరోజు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.