రెండు రోజుల క్రితం సౌత్ కొరియాలో స్టార్ హీరోయిన్ కిమ్ సే-రాన్(Kim Se-ron, a star heroine in South Korea), కేవలం 24 ఏళ్లకే చనిపోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది.ఫిబ్రవరి 16న సియోంగ్డాంగ్-గులోని తన ఇంట్లో శవమై కనిపించింది.
ఇది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చేశారు, ఎవ్వరూ చంపిన దాఖలాలు లేవన్నారు.అసలే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుని విమర్శలు ఎదుర్కొంటున్న కిమ్ సే-రాన్(kim se ron) చనిపోవడంతో ఫ్యాన్స్ గుండెలు పగిలిపోతున్నాయి.
మొన్నటిదాకా తిట్టిన నోళ్లే ఇపుడు అయ్యో పాపం అంటున్నారు.అసలు సౌత్ కొరియాలో ఆడవాళ్లకి జరుగుతున్న అన్యాయం గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.కిమ్ సే-రాన్ చనిపోయాక BTS రాపర్ మిన్ యూంగి(BTS rapper Min Yoongi) (SUGA) పేరు కూడా ట్రెండ్ అవుతోంది.అసలు విషయం ఏంటంటే, ఒకసారి యూంగి ఎలక్ట్రిక్ కిక్‌బోర్డు మీద వెళ్తూ కిందపడ్డాడు.
అప్పుడు అతను తాగాడా లేదా అని ఎవ్వరూ చెప్పలేదు, కానీ అప్పుడు ఫేక్ సీసీటీవీ వీడియోలు(CCTV VIDEOS), తప్పుడు వార్తలను మాత్రం వైరల్ చేశారు.

యూంగి ఎవరికీ ఏం హాని చేయలేదని, జస్ట్ టర్న్ తీసుకునేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పడ్డాడని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.ఇంకా అతను మిలటరీ సర్వీస్‌లో ఉండటం వల్ల ఇండస్ట్రీకి కూడా తిరిగి రాలేదు.మరోవైపు సౌత్ కొరియాలో చాలా మంది మగ సెలబ్రిటీలు మాత్రం ఎంత పెద్ద తప్పులు చేసినా, రేప్ కేసులు ఉన్నా కూడా కొన్నాళ్లకి మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు.
బర్నింగ్ సన్ స్కాండల్‌లో ఉన్న వాళ్లంతా కూడా జైలు నుంచి బయటకు వచ్చేశారు.
కిమ్ సే-రాన్ 2022 మే 15న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయింది.
గ్యాంగ్‌నమ్‌లో కార్ యాక్సిడెంట్ చేసి చాలా వాటిని గుద్దేసింది, దాంతో 57 బిజినెస్‌లకు పవర్ పోయింది.ఆమె బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ 0.2% ఉంది, లీగల్ లిమిట్ 0.08% కంటే చాలా ఎక్కువ.దాంతో ఆమె లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు.కానీ ఆమె వల్ల ఎవ్వరికీ దెబ్బలు తగలలేదు.

కాగా ఈ యువ నటిని బాగా టార్గెట్ చేశారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.“బర్నింగ్ సన్ కేసులో ఉన్న మగాళ్లంతా ఫ్రీగా తిరుగుతున్నారు, రేపిస్టులు, అబ్యూజర్లు ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నారు.కానీ కిమ్ సే-రాన్‌ని మాత్రం 9 ఏళ్లప్పటినుంచే జడ్జ్ చేస్తున్నారు, ఆమె సారీ చెప్పింది, ముందుకు వెళ్లాలని చూసింది.కానీ ఇపుడు అన్నీ అయిపోయాయి.సౌత్ కొరియాలో ఆడవాళ్లకి బతకడమే కష్టం.” అని ఒకరు పేర్కొన్నారు.కిమ్ సే-రాన్ విషాదకర మరణం సౌత్ కొరియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఆడవాళ్లకి జరుగుతున్న అన్యాయం గురించి పెద్ద చర్చకు దారితీసింది.







