కొంతకాలం క్రితం ఓ యూకే జంట సంచలన నిర్ణయం తీసుకుంది.తిండి పెట్టే ఉద్యోగాలు వదిలేసి, నీడ నిచ్చే ఇల్లు అమ్మేసింది.
అంతేకాదు, పిల్లలతో ప్రపంచ యాత్ర మొదలెట్టింది.ఇక వాళ్లకు కష్టాలు తప్పవు అని అందరూ అనుకున్నారు కానీ వాళ్లు మాత్రం ఇప్పుడు డబ్బు సంపాదనకు అదిరిపోయే మార్గం కూడా పట్టేశారు.
వివరాల్లోకి వెళితే, బ్రిటన్‌కు చెందిన క్రిస్, తమిరా హచిన్సన్ Chris,Tamira Hutchinson)దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ప్రపంచాన్ని చుట్టేయాలని ఫిక్సయ్యారు.పెరిగిపోతున్న ఖర్చులు, సమాజంలో మార్పులు వాళ్లని విసిగించేశాయి.
ఇక ఆలస్యం చేయకుండా ప్రయాణ ఖర్చుల కోసం ఇల్లు, కార్లు ఉన్నదంతా అమ్మేశారు.
గడిచిన ఆరు నెలలుగా వాళ్లు సంచార జీవితం గడుపుతున్నారు.
థాయ్‌లాండ్, చైనా, మలేషియా(Thailand, China, Malaysia) దేశాలలో తెగ తిరిగేస్తున్నారు.అసలు విషయం ఏంటంటే, బ్రిటన్‌లో బ్రతకడం కంటే ఈ కొత్త లైఫ్‌స్టైల్ చాలా చౌక అంట.బ్రిటన్‌లో అయితే నెలకి అక్షరాలా 3 లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు.అద్దె, కరెంటు బిల్లులు, తిండి ఖర్చులు, ప్రయాణాలు ఇలా అన్నీ కలిపి జేబు గుల్ల అయ్యేది.
రోజంతా కష్టపడినా సరదాగా గడపడానికి కూడా డబ్బులు మిగిలేవి కాదట.పర్సనల్ ట్రైనర్, వీడియోగ్రాఫర్ అయిన క్రిస్ ఏమన్నాడంటే “ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాం.కానీ వీకెండ్ వచ్చిందంటే మాత్రం.ఏం కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు” అని వాపోయాడు.

ఇప్పుడేమో నెలకి లక్షా 20 వేల రూపాయలు కూడా ఖర్చు అవ్వట్లేదంట.బ్రిటన్‌లో ఖర్చు చేసిన దానిలో సగం కంటే తక్కువే.రోజుకి రూమ్ అద్దెకి 3 వేలు, తిండి, ఇతర అవసరాలకి 4 వేలు ఖర్చు చేస్తున్నారట.కొన్ని రోజులైతే రూపాయి కూడా ఖర్చు లేకుండా హ్యాపీగా గడిపేస్తున్నారట.
యూకే(UK) వదిలేసే ముందు క్రిస్ ట్రావెల్ వ్లాగులు(Chris’s Travel Vlogs) చేయడం కోసం వీడియోలు తీయడం నేర్చుకున్నాడు.అదే ఇప్పుడు వాళ్లకి మెయిన్ ఇన్కమ్ సోర్స్.
సోషల్ మీడియాలో వాళ్ల ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్లు 7 వేల నుంచి లక్షకి చేరారు, టిక్‌టాక్‌లో ఫాలోయర్లు 12 వేల నుంచి 2 లక్షల 50 వేలకు పెరిగారు.
వాళ్లు తీసే ట్రావెల్ వీడియోలతో ఇప్పుడు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు.దాంతో వాళ్ల కొత్త లైఫ్ స్టైల్ పర్మినెంట్ అయిపోయిందంతే.

అంతా అమ్మేయడం నిజంగా కష్టమని తమిరా ఒప్పుకుంది.తను ఇంతకుముందు స్విమ్మింగ్ నేర్పించేది.కానీ అలా అమ్మడం వల్ల స్టోరేజ్ ఖర్చులు లేకుండా ఫ్రీగా బతకగలుగుతున్నామంటున్నారు.గుర్తుగా కొన్ని సెంటిమెంట్ ఉన్న వస్తువులు మాత్రమే బంధువుల దగ్గర దాచుకున్నారట.ఇప్పుడు డబ్బు టెన్షన్ లేకుండా ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నామని క్రిస్ తెగ సంతోషపడిపోతున్నాడు.పిల్లలకి స్కూల్ కూడా మాన్పించేశారు.
ట్రావెలింగే వాళ్లకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తుందని నమ్ముతున్నారు ఈ జంట.ప్రస్తుతానికి యూకేకి వెనక్కి వెళ్లే ఆలోచనలేదంట వాళ్లకి.ఈ అడ్వెంచర్‌ని, ఫ్రీడమ్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ కపుల్.







