జంతువుల చిత్రవిచిత్ర ప్రవర్తన మనుషులకు చాలా ఆనందం కలిగిస్తుంది.ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ కావడం చూస్తూ ఉంటాము.
మరీ ముఖ్యంగా కుక్కలు, కోతులు, పిల్లులు వంటి జంతువుల ప్రవర్తన మనిషి అనేవాడికి చాలా నచ్చుతుంది.ఎందుకంటే ఆ జంతువులు అనేవి చాలావరకు జనావాసాల్లోనే జీవిస్తాయి కనుక.
వీటిలో కొన్ని జంతువులు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటాయి.ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట జనాలకు తెగ కితకితలు పెడుతోంది.
విషయం ఏమిటంటే… ఓ పిల్లికి ఏమనిపించిందో, మెట్లు దిగడానికి మరి టైం వేస్ట్ అని ఫీలైయ్యిందో గానీ ఏకంగా ఒక్కసారిగా ఎత్తైన బిల్డింగ్( tall building ) పైనుంచి అమాంతం కిందకి దూకేసింది.కాగా ఆ పిల్లి ప్రవర్తించిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.ఎత్తైన భవనం ఎక్కిన పిల్లి దిగే సమయంలో ఓపిక చచ్చి చివరకు బిల్డింగ్ అంచున ఉన్న రక్షణ గోడ పైకి ఎక్కి అందరూ చూస్తుండగానే పైనుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో కాసేపు తటపటాయించడం ఇక్కడ వీడియోలో చాలా స్పష్టంగా చూడవచ్చు.ఆ తర్వాత ఒక్కసారిగా పైనుంచి కిందకు దూకేసింది.ఆ మధ్యలో విద్యుత్ వైరుకు తగులుకుని అటుఇటు ఊగుతూ ధబేల్‌మని కిందపడిపోయింది.
అయితే, ఈ ఘటనలో పిల్లికి ( Cat )ఎలాంటి గాయాలు కాకపోవడం కొసమెరుపు.ఆశ్చర్యకరంగా పైలేచి మళ్లీ అక్కడి నుంచి పరుగందుకుంది.కాగా ఈ ఘటనను బిల్డింగ్ పైనుంచి కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దాంతో దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘‘పిల్లి దూకుతుంటే వేడుక చూసిన ఫీలింగ్ కలిగింది’’.అంటూ కొందరు కామెంట్ చేస్తే, ‘‘జంతువుల పట్ల ఇలాంటి పైశాచికత్వం పనికి రాదు, పిల్లి అలా సూసైడ్ చేసుకుంటే ఆపాల్సింది పోయి, వేడుక చూస్తారా?’’.అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు చదువరులు మాత్రం ఇలాంటి తేలిక బరువు కలిగిన జంతువులు ఎక్కడినుండి ఎక్కి దూకినా ప్రమాదాలు సంభవించవు అని కామెంట్స్ చేస్తున్నారు.