హెయిర్ గ్రోత్ ( Hair growth )లేదని బాధపడుతున్నారా.? జుట్టు ఎదుగుదలను పెంచుకునేందుకు రకరకాల హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పొడి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే పైపై పూతలే కాదు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున తింటే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం గింజలు( cup almonds ) వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు గుమ్మడి గింజలు( Pumpkin seeds ), అర కప్పు వాల్ నట్స్, అర కప్పు అవిసె గింజలు,( flax seeds ) రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ ను విడివిడిగా వేయించుకుని చల్లారపెట్టుకోవాలి.మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పదార్థాలు అన్నిటిని వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ఈ పొడిని మీరు నేరుగా తినొచ్చు లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు.రోజుకు ఒక స్పూన్ చొప్పున ఈ పొడిని తీసుకుంటే అందులో ఉండే విటమిన్ ఈ, విటమిన్ బి, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడంలో ఈ పొడి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.నిత్యం ఈ పొడిని తీసుకుంటే జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఒత్తుగా మరియు పొడుగ్గా మారుతుంది.
హెయిర్ సూపర్ స్ట్రాంగ్ గా కూడా మారుతుంది.