దాదాపు 80 శాతం మందికి శరీరం మొత్తం ఒక రంగులో ఉంటే మోచేతులు మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.డెడ్ స్కిన్ సెల్స్( Dead skin cells ) పేరుకుపోవడం, హైపర్ పిగ్మెంటేషన్, బట్టల నుండి ఘర్షణ లేదా మీ మోచేతులను టేబుల్‌పై ఉంచడం, హార్మోన్ ఛేంజ్ తదితర కారణాల వల్ల మోచేతులు నల్లగా తయారవుతాయి.
పురుషులు మోచేతుల నలుపును పెద్దగా పట్టించుకోరు.కానీ ఆడవారు మాత్రం ఆ నలుపును పోగొట్టుకుని మోచేతులను తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మోస్ట్ ఎఫెక్టివ్ గా హెల్ప్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ చందనం పౌడర్ వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ శనగపిండి( Besan flour ), పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut oil )మరియు వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ షాంపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులకు కొంచెం మందంగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మచెక్కతో మోచేతాలను బాగా రుద్ది వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేశారంటే మోచేతుల నలుపు క్రమంగా మాయం అవుతుంది.కొద్ది రోజుల్లోనే మీ మోచేతులు తెల్లగా కాంతివంతంగా మారతాయి.కాబట్టి తమ మోచేతులు నల్లగా అసహ్యంగా కనిపిస్తున్నాయని ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.పైగా మెడ నలుపుతో బాధపడేవారు, పాదాలను తెల్లగా మెరిపించుకోవాలని భావించే వారికి కూడా ఈ పవర్ ఫుల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
సో డోంట్ మిస్.